ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ జిల్లా తానా టప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో షామా అనే ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు రెండు తలలు, నాలుగు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి.
షామా సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. మొదట్లో కవలలు జన్మిస్తారని అనుకున్నామని స్టాఫ్ నర్సు ప్రీతి సింగ్ తెలిపారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్లోనూ అదే తేలిందని వివరించారు. కానీ అతికష్టం మీద ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. బ్రిజేష్ కుమార్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తామన్నారు.
ఇదీ చదవండి : ఉత్తర్ప్రదేశ్లో కిడ్నాపై.. కడపకు చేరి..!