మహారాష్ట్రలోని ముంబయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. పండుగల వేళ.. దేశ ఆర్థిక రాజధానిలో ఉగ్రవాదులు క్షిపణి/ డ్రోన్ దాడులు చేసే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిషేధించారు ముంబయి పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 28 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నట్లు స్పష్టం చేశారు.