ETV Bharat / bharat

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో నిరసనలు

author img

By

Published : Nov 22, 2019, 4:55 PM IST

పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసోంలో నిరసన జ్వాలలు చెలరేగాయి. కృషక్​ ముక్తి సంగ్రామ్​ సమితితోపాటు పలు సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును అంగీకరించమని తేల్చి చెబుతున్నారు.

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో నిరసనలు

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019కు వ్యతిరేకంగా అసోంవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. గువహటిలో సామాజిక కార్యకర్త అఖిల్​ గొగొయి నేతృత్వంలోని కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్) ఆధ్వర్యంలో బిల్లును నిరసిస్తూ 'రాజ్​భవన్​ ఛలో' కార్యక్రమాన్ని నిర్వహించారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అసోం గవర్నర్​కు తీర్మానాన్ని పంపారు. దీనిని రాష్ట్రపతికి చేరవేయాల్సిందింగా కోరారు అఖిల్​. కేఎంఎస్​ఎస్​తో పాటు యూఎల్​ఎఫ్ఏ నేతలు అనుప్​ ఛెతియా, మృణాల్ హజారికా, మరో కార్యకర్త లచిత్ బోర్డోలోయి వేర్వేరుగా నిరసనలు చేపట్టారు.

"ఈ బిల్లుతో విదేశీయులు అసోంలోకి ప్రవేశిస్తారు. సుమారు 1.9 కోట్ల మంది హిందూ బంగ్లాదేశీయులు మా ఉద్యోగాలను పొందుతారు. ఫలితంగా అసలైన స్థానికుల్లో నిరుద్యోగం పెరుగుతుంది."

-అఖిల్ గొగొయి, సామాజిక కార్యకర్త

అసోంను మతప్రాతిపదికన విభజించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్​ హిరేన్​ గోహైన్​ ఆరోపించారు. తమ ప్రాణాలు ఉన్నంతవరకు ఈ బిల్లును అంగీకరించమని తేల్చిచెప్పారు.

ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్​(ఏఏఎస్​యూ) కూడా నిరసనల్లో పాల్గొంది. అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీలను అక్కున చేర్చుకోవటానికి అసోం చెత్త బుట్ట కాదని వ్యాఖ్యానించారు ఏఏఎస్​యూ నేతలు.

ఇదీ చూడండి: 'గాంధీ'ల కోసం వచ్చేవారం లోక్​సభలో 'ప్రత్యేక' బిల్లు

Mumbai, Nov 22 (ANI): Shiv Sena's Kishori Pednekar elected unopposed as Mayor of Brihanmumbai Municipal Corporation (BMC) on Nov 22. Shiv Sena Suhas Wadkar was elected as Deputy Mayor. There are 27 municipal bodies, including Mumbai, Thane, Pune and Aurangabad where Mayoral elections were held.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.