బాంబు బెదిరింపు హెచ్చరికలతో ముంబయి నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా లండన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
అమెరికా న్యూజెర్సూలోని న్యూవార్క్‌కు వెళ్లాల్సిన ఏఐ 191 విమానాన్ని బాంబు బెదిరింపు కారణంగా లండన్‌లోని స్టాన్స్టెడ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ఈ సమయంలో యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన టైఫూన్ యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి.
బాంబు బెదిరింపు వార్తలు అబద్ధమని తేలాక.. ఏఐ 191 విమానం తిరిగి న్యూవార్క్‌కు బయలుదేరిందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: ఉన్నావ్ జైలులో ఖైదీల చేతుల్లో తుపాకులు