ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: తృణమూల్​ కాంగ్రెస్​తో ఓవైసీ పొత్తు!

author img

By

Published : Nov 15, 2020, 4:31 PM IST

Updated : Nov 15, 2020, 10:35 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు ఎగరేసుకుపోయి మహాకూటమికి అధికారాన్ని దూరం చేయటంలో తనవంతు పాత్ర పోషించింది.. అసదుద్దీన్​ ఓవైసీకి చెందిన ఎంఐఎం. ఈ క్రమంలో భాజపాకు లబ్ది చేకూరేలా మైనారిటీ ఓట్లను చీల్చటమే ఎంఐఎం ముఖ్య ఉద్దేశమని విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది బంగాల్​ ఎన్నికల్లో టీఎంసీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రతిపాదన చేసింది ఎంఐఎం. మరి బంగాల్​ పోరులో ఎంఐఎం పోటీ ఎవరికి లబ్ధి చేకూర్చనుంది..?

MIM wants alliance with Trinamool
బంగాల్​ ఎన్నికల్లో టీఎంసీతో ఎంఐఎం పొత్తు!

అసదుద్దీన్​ ఓవైసీకి చెందిన అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీ ఇటీవల జరిగిన బిహార్​ ఎన్నికల్లో సత్తా చాటింది. అనూహ్యంగా ఐదు సీట్లు గెలుచుకుంది. అయితే.. భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరేలా మైనారిటీ ఓట్లను చీల్చటమే ఓవైసీ నిజమైన ఉద్దేశంగా ఆరోపణలు వచ్చాయి. మహాకూటమికి విజయాన్ని దూరం చేయాలనే లక్ష్యంతోనే విభజన రాజకీయాలు చేశారని విమర్శలు ఎదుర్కొంది ఎంఐఎం.

ఈ తరుణంలో వచ్చే ఏడాది బంగాల్​లో జరగనున్న ఎన్నికలకు అసదుద్దీన్​ సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేస్తామని ఇప్పటికే ప్రకటించారు ఓవైసీ. అయితే.. బిహార్​ మాదిరిగానే, బంగాల్​లో కూడా ముస్లిం ఓట్లను ఎంఐఎం ద్వారా విభజించడం వల్ల భాజపాకి ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ప్రణాళికలు మొదలుపెట్టిండి ఎంఐఎం. భాజపాను అడ్డుకోవటానికి అధికార తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)తో కూటమిగా ఏర్పడాలని చూస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంఐఎం నాయకత్వం బహిరంగ ప్రతిపాదన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈటీవీ భారత్​తో ముఖాముఖి సందర్శంగా.. ఎంఐఎం జాతీయ ప్రతినిధి, పార్టీ బంగాల్​ పరిశీలకుడు అసిమ్​ వాకర్​ కీలక విషయాలు వెల్లడించారు. భాజపాను ఎదుర్కోవటానికి తమ నాయకత్వం తృణమూల్​ కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

"తృణమూల్​ కాంగ్రెస్​ భాజపాను నేరుగా ఎదుర్కోలేకపోతోందని.. 2019 లోక్​సభ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి టీఎంసీతో జట్టు కట్టాలని మా నాయకుడు అసదుద్దీన్​ ఓవైస్​ కోరుకుంటున్నారు. ఇప్పుడు దానిపై నిర్ణయం మమతా బెనర్జీ చేతిలో ఉంది. అందుకు ఆమె అంగీకరిస్తే స్వాగతిస్తాం. లేదా, ఎంఐఎం సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, ఎన్ని సీట్లల్లో అభ్యర్థలను బరిలో నిలపాలి అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాం."

- అసిమ్​ వాకర్​, ఎంఐఎం జాతీయ ప్రతినిధి.

మమతదే తుది నిర్ణయం: టీఎంసీ

ఎంఐఎంతో కూటమిగా ఏర్పడంపై తృణమూల్​ కాంగ్రెస్​ను ఈటీవీ భారత్​ సంప్రదించగా.. దాటవేసే సమాధానం ఇచ్చారు టీఎంసీ చీఫ్​ విప్​ తపస్​ రాయ్​. కూటమిగా ఏర్పడటమనేది చాలా సున్నితమైన అంశమని, తుది నిర్ణయం ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే తీసుకుంటారని తెలిపారు. ఈ అంశంపై మమత ఒక్కరే మాట్లడగలరని చెప్పారు. ఇలాంటి అభిప్రాయమే వెల్లడించారు బంగాల్​ విద్యుత్తు శాఖ మంత్రి శోభన్​దేవ్​ చటోపాధ్యాయ్​. దీదీదే తుది నిర్ణయంగా చెప్పారు. బిహార్​తో పోలిస్తే బంగాల్​ ఓటర్ల మనస్తత్వం వేరుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని, వచ్చే ఏడాది కూడా అదే జరుగుతుందన్నారు.

'పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి'

ఈ అంశంపై అఖిల భారత మైనారిటీ యూత్​ ఫెడరేషన్​ ప్రధాన కార్యదర్శి మోహమ్మద్ కమ్రుజ్జమాన్​ను సంప్రదించగా.. భాజపాను అడ్డుకునేందుకు పార్టీలన్నీ తమలోని భావజాల బేధాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి రావాలన్నారు. పార్టీలన్నీ.. తమకు భాజపా ప్రత్యర్థికగా పేర్కొంటున్నా.. అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. కేవలం ఓవైసీ ఒక్కరే తన ప్రయోజనాలను పక్కన పెడితే సాధ్యం కాదన్నారు.

కాంగ్రెస్​-లెఫ్ట్​, టీఎంసీల ఆందోళన..!

టీఎంసీతో కూటమిగా ఏర్పడకుండా ఎంఐఎం సొంతంగా పోటీ చేస్తే... కాంగ్రెస్​-లెఫ్ట్​ ఫ్రంట్​ కూటమి, తృణమూల్​ కాంగ్రెస్​లు రెండూ ఆందోళన చెందడానికి కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బిహార్​లో మాదిరిగానే.. కోల్​కతా, దాని పక్క జిల్లాలైన హౌఢా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఉర్దూ మాట్లాడే ముస్లిం ప్రాంతాల్లో ఎంఐఎంకు మంచి ఆదరణ ఉంది. ఈ ప్రాంతాల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలవకపోయినా.. కాంగ్రెస్​-లెఫ్ట్​, టీఎంసీల ఓట్లను చీల్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. 'బిహార్​లోని ముస్లీం ఓట్లను విభజించి పలు నియోజకవర్గాల్లో భాజపాకు విజయాన్ని చేకూర్చింది ఎంఐఎం. ఈ క్రమంలో బంగాల్​లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది' అని బంగాల్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు అధిర్​ రంజన్​ చౌదర్​ పేర్కొనటం అందుకు బలాన్ని చూకూర్చుతోంది. అయితే.. బంగాల్​లో ఎంఐఎం ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత. మొత్తం ముస్లిం జనాభాలో ఉర్దూ మాట్లాడేవారు 6 శాతం మాత్రమే ఉన్నారని, వారి మద్దతుతో ఎంఐఎం ఏదో చేస్తుందనుకోవటం సరికాదన్నారు.

ఇదీ చూడండి: బిహార్​లో 'ఎంఐఎం' జోరు- ఐదు సీట్లు కైవసం

Last Updated : Nov 15, 2020, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.