ETV Bharat / bharat

ఐఆర్​సీటీసీకి మరో రెండు తేజస్​ రైళ్లు అప్పగింత!

రైల్వేశాఖ సబ్సిడరీ... ఐఆర్​సీటీసీకి మరో రెండు తేజస్​ రైళ్ల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ పైలట్​ ప్రాజెక్టు ద్వారా టికెట్ల ధర నిర్ణయం, నిర్వహణ వంటివి ఐఆర్​సీటీసీకే దఖలు పడతాయని తెలుస్తోంది.

ఐఆర్​సీటీసీకి మరో రెండు తేజస్​ రైళ్లు అప్పగింత!
author img

By

Published : Aug 21, 2019, 5:16 AM IST

Updated : Sep 27, 2019, 5:44 PM IST

ఐఆర్​సీటీసీకి మరో రెండు తేజస్​ రైళ్లు అప్పగింత!

రైల్వేను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం. రైల్వేశాఖ సబ్సిడరీ ఐఆర్​సీటీసీకి దిల్లీ-లఖ్​నవూ, అహ్మదాబాద్-ముంబయి మధ్య రాకపోకలు సాగించే తేజస్​ రైళ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు యోచిస్తోంది. ప్రైవేటీకరణకు ముందు పైలట్​ ప్రాజెక్ట్​గా ఐఆర్​సీటీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

రైల్వేబోర్డు బ్లూప్రింట్ ప్రకారం ఇప్పటివరకు పర్యటక, భోజన వసతులను నిర్వహిస్తోన్న ఐఆర్​సీటీసీకి రెండు రైళ్ల టికెట్​ ధరలనూ నిర్ణయించే అధికారం హస్తగతం కానుంది. ఐఆర్​సీటీసీ మూడేళ్లపాటు ఈ రైళ్ల బాధ్యతలను నిర్వర్తిస్తుంది. వీటిలో రాయితీలు, గౌరవార్థ టికెట్ కేటాయింపులు, ఉద్యోగ పాసులు పనిచేయకుండా ఉండే దిశగా రైల్వేశాఖ నిర్ణయించిందని సమాచారం. టికెట్ల తనిఖీలు కూడా రైల్వే ఉద్యోగులు చేయరని అధికారులు వెల్లడించారు.

రైలు సర్వీసు నెంబర్లు, కార్యనిర్వాహక ఉద్యోగులు, చోదకులు, గార్డులు, స్టేషన్ మాష్టర్లుగా రైల్వే ఉద్యోగులే పనిచేయనున్నారు.

రైల్వేల్లో ప్రైవేటు యాజమాన్యాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ స్థాయి ప్రయాణ సేవలను అందించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ మేరకు 100 రోజుల ప్రణాళికలో లక్ష్యించింది. ఈ నేపథ్యంలోనే రెండు రైళ్లను ఐఆర్​సీటీసీకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది.

రైళ్లపై ప్రకటనలు, బ్రాండింగ్ సైతం ఐఆర్​సీటీసీనే నిర్వహించనుంది. బోగీల మౌలిక స్వభావం దెబ్బతినకుండా లోపలి భాగాలను ఆధునీకరించేందుకూ అనుమతించింది రైల్వేశాఖ. మరో ఏడాదిలో ఇంటర్​నెట్ ద్వారా ఈ రైళ్ల టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. వీటికి సంబంధించిన అకౌంట్లను ప్రత్యేకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఈ రైళ్లలో 18 బోగీలు ఉండగా... 12 కోచ్​లను మాత్రమే నడిపేందుకు ఏడాదిపాటు ఐఆర్​సీటీసీకి అవకాశం రానుంది. నడుస్తున్న బోగీల ఆధారంగా టికెట్ ధరలపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రమాదాలు జరిగితే సాధారణ రైలు ప్రయాణికులకు లభించే అన్ని సౌకర్యాలు, పరిహారం ఐఆర్​సీటీసీ ప్రయాణికులకు అందించాలని నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. వీటి నిర్వహణకు రైల్వేశాఖే కేటాయింపులు చేయనుంది.

ఇదీ చూడండి: ఐఎన్​ఎక్స్​ కేసు: ఏ క్షణంలోనైనా చిదంబరం అరెస్ట్!

New Delhi, Aug 20 (ANI): A team of Central Bureau of Investigation (CBI) officers arrived at the residence of former union finance minister P Chidambaram. Earlier today, Delhi High Court had dismissed his both anticipatory bail pleas in connection with INX Media case. The team of CBI officers later left from the residence of P Chidambaram. HC observed that Chidambaram is the 'key conspirator' in the INX Media case.
Last Updated : Sep 27, 2019, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.