దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.
దిల్లీలో కృషి భవన్ ప్రాంతంతో పాటు పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది.
కర్ణాటకలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నావిలుతీర్థ ఆనకట్ట ఉప్పోంగి ప్రవహిస్తోంది.. దీంతో బెలగావి, సున్నాల ప్రాంతాల్లో ఇళ్లు, పంట పోలాలు నీట మునిగాయి.
ఛత్తీస్‌గఢ్ సుక్మా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వరద కారణంగా ఫండిగూడ ప్రాంతం నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను జిల్లా పాలనాధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మహారాష్ట్ర ముంబయిలో భారీ వర్షాలకు మోడక్ సాగర్ ఆనకట్ట నిండు కుండలా మారింది. ఈ ఆనకట్టకు వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో డ్యాం గేట్ తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు.