పండిత్ దీన్‌దయాళ్ శర్మ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామీణ్ కౌశల్ యోజన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేశారు మోదీ. వ్యవసాయ సంస్కరణలు రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చామని ఉద్ఘాటించారు.
"గత ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాయి. అవి ఏ మాత్రం రైతులు, కార్మికులకు అర్థం కావు. కానీ, భాజపా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం. గతేడాదిగా 10 కోట్ల మంది రైతులకు రూ.లక్ష కోట్లు అందించాం. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం."
- ప్రధాని నరేంద్రమోదీ
ఇదే వేదికగా బిల్లుకు వ్యతిరేకిస్తున్న విపక్షాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు మోదీ.
-
PM Narendra Modi takes part in the celebrations of Foundation Day of Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana on the occasion of his birth anniversary, via video conferencing.
— ANI (@ANI) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
BJP national president JP Nadda & Defence Minister Rajnath Singh also attend the event. pic.twitter.com/4rHavcEU1E
">PM Narendra Modi takes part in the celebrations of Foundation Day of Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana on the occasion of his birth anniversary, via video conferencing.
— ANI (@ANI) September 25, 2020
BJP national president JP Nadda & Defence Minister Rajnath Singh also attend the event. pic.twitter.com/4rHavcEU1EPM Narendra Modi takes part in the celebrations of Foundation Day of Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana on the occasion of his birth anniversary, via video conferencing.
— ANI (@ANI) September 25, 2020
BJP national president JP Nadda & Defence Minister Rajnath Singh also attend the event. pic.twitter.com/4rHavcEU1E
"కాంగ్రెస్ ఇన్నేళ్ల పాలనలో రైతులకు అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు వాళ్ల భుజాలపై నుంచి తుపాకీతో కాలుస్తోంది. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. వీటి నుంచి రైతులను భాజపా కార్యకర్తలే కాపాడాలి. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి కొత్త వ్యవసాయ బిల్లుపై వివరించాలి. ఈ బిల్లులపై ఇతరులు చేస్తోన్న ప్రచారాల్లోని నిజానిజాలపై వారికి వివరణ ఇవ్వాలి" అని మోదీ అన్నారు.
దీన్‌దయాళ్ జయంతి..
భాజపా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్ జావడేకర్, డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. దీన్‌దయాళ్‌తో పాటు మరో అగ్రనేత శ్వామప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: మోదీ నా కుమారుడితో సమానం: షాహీన్‌బాగ్ ఉద్యమకారిణి