ETV Bharat / bharat

'చర్చల్లో పురోగతి లేకుంటే 6న ట్రాక్టర్​ ర్యాలీ'

author img

By

Published : Jan 1, 2021, 7:04 PM IST

Updated : Jan 1, 2021, 8:13 PM IST

వ్యవసాయ చట్టాలపై జనవరి 4న మరో విడత జరగనున్న చర్చల్లో పురోగతి లేకుంటే.. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు రైతులు. అన్నివైపుల నుంచి దిల్లీని ముట్టడిస్తామన్నారు.

Agitating farmer unions will have to take firm steps if govt does not take a decision in our favour by January 4: Farmer leaders
'4న చర్చలు విఫలమైతే దిల్లీ మొత్తం దిగ్బంధమే!'

కేంద్రానికి మరో హెచ్చరిక జారీ చేశారు హస్తిన సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు. మరోసారి జనవరి 4న జరగనున్న చర్చల్లో తమకు అనుకూలమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో కేవలం 5శాతం సమస్యలనే విన్నవించినట్లు అన్నదాతలు పేర్కొన్నారు.

రైతు సంఘాలు-ప్రభుత్వం మధ్య జనవరి 4న జరగనున్న సమావేశంలో పురోగతి లేకుంటే.. జనవరి 6న ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని రైతుల ప్రతినిధి యుధ్వీర్ సింగ్ అన్నారు. హరియాణా- రాజస్థాన్​ సరిహద్దుల్లోని రైతులు భారీ సంఖ్యలో.. దిల్లీని ముట్టడిస్తారని హెచ్చరించారు. హరియాణాలో.. షాపింగ్​ మాళ్లు, పెట్రోల్​ బంకులు బంద్​ చేస్తామని మీడియాకు వెల్లడించారు.

కేంద్రం-రైతు సంఘాలతో ఆరు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. నాలుగు అంశాలే ప్రధాన అజెండాగా ఆరోసారి సమావేశానికి హాజరయ్యారు రైతు ప్రతినిధులు. అయితే ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. దీంతో మరో విడత చర్చలు జరపనున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తిన సరిహద్దుల్లో నెలరోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు అన్నదాతలు.

ఇదీ చూడండి: పాక్​లో గుడి కూల్చివేతపై భారత్ నిరసన

Last Updated : Jan 1, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.