ETV Bharat / entertainment

ది గోట్​ 2.59 గంటల సినిమా కాదు! - అసలు రన్​ టైమ్​ ఎంతంటే? - Vijay The Goat Movie - VIJAY THE GOAT MOVIE

Vijay The Goat Runtime : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్​' అసలు రన్ టైమ్ తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇంతకీ ఈ సినిమా పూర్తి నిడివి ఎంతంటే?​

Vijay The Goat Runtime
Vijay (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 12:11 PM IST

Vijay The Goat Runtime : కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తాజాగా 'ది గోట్‌' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరుగానే వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. అయితే 2 గంటల 59 నిమిషాల నిడివితో థియేటర్‌లో వచ్చిన ఈ చిత్రం అసలు రన్‌టైమ్‌ను అది కాదని డైరెక్టర్ వెంకట్​ ప్రభు తాజాగా రివీల్ చేశారు.

తాజాగా ఫ్యాన్స్​తో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించిన ఆయన అసలు రన్ టైమ్​ను చెప్పారు. ఈ చిత్రం 3.40 గంటల నిడివితో రన్​ చేయాలని తొలుత నిర్ణయించుకున్నమని వెంకట్ ప్రభు అన్నారు. అయితే ఈ చిత్ర ఓటీటీ వెర్షన్​ను మాత్రం ఆయన తొలుత అనుకున్న రన్‌టైమ్‌తోనే (3 గంటల 40 నిమిషాల) నిడివితోనే విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు వెంకట్​ చెప్పారు. ఇక ఈ టైమింగ్స్ విన్న నెటిజన్లకు ఒక్కసారిగా దిమ్మతిరిగినంత పనైందని అంటున్నారు. ఇంత రన్​టైమ్​తో సినిమా వచ్చుంటే ఎలా ఉండేదో అని కామెంట్లు పెడుతున్నారు.

భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 250కు పైగా సెంటర్లలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా ఫస్ట్ డే తమిళంలో రూ.40 కోట్లు, తెలుగులో రూ. 3 కోట్లు, హిందీలో రూ.2 కోట్లు, కన్నడలో రూ.3 కోట్లు, కేరళలో రూ. కోటి, ఇతర రాష్ట్రాల్లోనూ రూ.కోటి రూపాయల నికర వసూళ్లను సాధించింది.

ఇదిలా ఉండగా, ఈ చిత్రం ఓవర్సీస్​లోనూ దూసుకెళ్తూ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అందుకుంది. అమెరికా, యూకే, ఇతర దేశాల్లో కలిపి దాదాపు 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు తొలి రోజు రూ.126 కోట్లు, రెండో రోజు రూ.176 కోట్లు సాధించింది.

కాగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించారు. ఇతర పాత్రల్లో స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్, మోహన్‌లు నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించగా, దీనికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.

'ది గోట్' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ అఫీషియల్ డీటెయిల్స్​ - ఏకంగా ఎంత వసూలు చేసిందంటే? - The GOAT First Day Collections

ఫ్యాన్స్​కు దళపతి 'డబుల్' ట్రీట్ - 'ది గోట్' ఎలా ఉందంటే? - Vijay The Goat Movie Telugu Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.