Jr Sheetal Devi: భారత ఆర్చర్ శీతల్ దేవి పారిస్ పారాలింపిక్స్‌లో తన ప్రదర్శనలో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది. రెండు చేతులు లేకపోయినా, ఆత్మవిశ్వాసంతో కాళ్లతో బాణాలు సంధించి విశ్వక్రీడల్లో పతకం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో శీతల్ స్వగ్రామానికే చెందిన ఓ 13ఏళ్ల దివ్యాంగ బాలిక ఆమెను స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా, ప్రాక్టీల్ కూడా మొదలు పెట్టేసింది. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది.
జమ్మూకశ్మీర్ కిష్త్వార్ ప్రాంతానికి చెందిన లోయిదార్ గ్రామంలో నివసించే 13 ఏళ్ల బాలికకు పుట్టుకతో కాళ్లు, చేతులు లేవు. అయితే వైకల్యంతో బాధపడకుండా, ఇటీవల పారిస్‌లో శీతల్ ప్రదర్శన చూసి ఆమె కూడా ఆర్చరీలో శిక్షణ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆమె ఆసక్తిని గమనించి, శీతల్ దేవికి ఆర్చరీలో శిక్షణ ఇచ్చిన కోచ్ కుల్దీప్ వెద్వాన్ స్వయంగా ఆమెకు విలువిద్యలో శిక్షణ ఇవ్వడానికి ముందుకువచ్చారు. ఆ బాలిక ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కోచ్ సాయంతో విల్లుతో బాణాలు వేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు సెల్యూట్ కొడుతున్నారు. మరో శీతల్ దేవి రెడీ అవుతోందంటూ బాలికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.
Inspired by the incredible Sheetal Devi, this 13-year-old girl with no arms or legs is breaking barriers and chasing her dreams in archery. 🏹#Archery pic.twitter.com/GkFFvMJYyj
— World Archery (@worldarchery) September 8, 2024
కాగా, రీసెంట్గా ముగిసిన పారిస్ పారాలింపిక్స్‌లో శీతల్ దేవి ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం ముద్దాడింది. అయితే సింగిల్స్‌లో శీతల్‌కు మెడల్ తృటిలో చేజారింది. కానీ ఈ పోటీలో శీతల్ ప్రదర్శనకు ప్రపంచం ఆశ్చర్యపోయింది. కాలితో విల్లును పట్టి భుజంతో బాణం విసిరి ఏకంగా పది పాయింట్లు సాధించి ఔరా అనిపించింది.
Paris Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడల్లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. 25 పతకాల లక్ష్యంతో బరిలో దిగితే అంచనాలుకు మించి రాణించి ఏకంగా 29 మెడల్స్‌తో మన అథ్లెట్లు సత్తా చాsheetal devi medals టారు. అందులో 7 పసిడి పతకాలు కాగా, 9 రజతం, 13 కాంస్యాలు ఉన్నాయి. మరి ఎవరెవరు ఏయే క్రీడాంశాల్లో ఏయే పతకాలు సాధించారో చూద్దాం.