ETV Bharat / bharat

'భౌతిక దూరమే' ఆ గిరిజనుల సంప్రదాయం! - భౌతిక దూరం సంప్రదాయం

ఇప్పుడు దేశం చూపంతా ఛత్తీస్​గఢ్​లోని ఓ గిరిజన బృందంవైపే. కరోనాపై పోరులో భౌతిక దూరాన్ని పాటించలేక అష్టకష్టాలు పడుతున్న వారికి ఈ గిరిజనుల జీవనశైలి ఓ పాఠంగా మారింది. భౌతిక దూరాన్ని సంప్రదాయంగా చేసుకుని జీవిస్తోన్న గిరిజనుల కుటుంబసభ్యుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో ఇల్లు ఉంటుంది. వంట కూడా వేర్వేరుగానే చేసుకుంటారు!

Age-old tradition of 'social distancing' has helped Chhattisgarh's Abhujhmaria tribe fight Covid-19
'భౌతిక దూరమే' ఆ గిరిజనుల సంప్రదాయం!
author img

By

Published : Jun 2, 2020, 7:16 AM IST

కరోనా మహమ్మారికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు బెంబేలెత్తుతున్నాయి. ఇరుకు ఇళ్లల్లో ఉంటూ.. ఎటువైపు నుంచి వైరస్​ వచ్చిపడుతుందోనని బిక్కుబిక్కమంటూ జీవిస్తున్నారు నగరవాసులు. అనేక చోట్ల భౌతిక దూరం పాటించడం చాలా కష్టంగా మారింది. అయితే ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ జిల్లాకు చెందిన ఓ గిరిజన బృందం.. తరతరాలుగా భౌతిక దూరాన్ని సంప్రదాయంగా మార్చుకుని జీవనం సాగిస్తోంది.

సంప్రదాయమే ముఖ్యం...

ఛత్తీస్​గఢ్​లో అత్యంత సున్నితమైన గిరిజనుల బృందాల్లో అభుజ్​మారియా ఒకటి. ఆసుపత్రులకు అనేక కిలోమీటర్ల దూరంలో..దరిద్రానికి అతి సమీపంలో జీవనం సాగిస్తున్నారు ఈ గిరిజనలు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి వీరిని తాకితే.. ఆ మొత్తం గిరిజన జాతే ప్రమాదంలో పడే అవకాశముంది. కానీ ఎన్నో ఏళ్లుగా వీరు పాటించే ఓ సంప్రదాయం.. ఇప్పుడు వీరిని కాపాడుతోంది. దేశాన్ని వీరివైపు చూసేలా చేసింది ఆ సంప్రదాయం.

Age-old tradition of 'social distancing' has helped Chhattisgarh's Abhujhmaria tribe fight Covid-19
ఇళ్లు ఇలా

అభుజ్​మారియా గిరిజనుల సంప్రదాయం ప్రకారం.. కుటుంబసభ్యుల్లో ఎవరి ఇళ్లు వారికి ఉంటాయి. భర్త, భార్య, కొడుకు, పిల్లలు... ఎవరైనా సరే వేరువేరుగా ఉండాల్సిందే. వేరువేరుగా వంట చేసుకోవాల్సిందే.

"నాకు ముగ్గురు మనవళ్లు ఉన్నారు. వారి ముగ్గురికీ మూడు ఇళ్లు కట్టి ఇచ్చాం. ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తున్నాం."

--- అభుజ్​మారియా మహిళ.

భౌతిక దూరాన్ని సంప్రదాయంగా చేసుకుని ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నప్పటికీ... వీరికి వైరస్​ సోకకుండా ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. నగరాల నుంచి వచ్చిన వారు మార్కెట్లు పెట్టుకునే 'హాట్​ బజార్​'ను రద్దు చేసింది. ఆశా వర్కర్లను రంగంలోకి దింపి.. శానిటైజేషన్​ వంటి పరిశుభ్రత చర్యలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.