ETV Bharat / bharat

రేపటి తరాల భవిత కోసం ప్లాస్టిక్​పై పోరు బాట - ప్లాస్టిక్​ నిషేధంపై ఈటీవీ భారత్​ ప్రచారం

నీటి సంరక్షణ చర్యల్లో ప్రధాని చేత 'శభాష్' అనిపించుకున్నాయి ఆ రెండు గ్రామాలు. ఇప్పుడు ప్లాస్టిక్​పై అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్​ను పారద్రోలేందుకు కంకణం కట్టుకున్నాయి. అవే ఝార్ఖండ్​లోని మారుమూల గ్రామాలు ఆరా, కేరమ్.

PLASTIC CAMPAIGN
రేపటి తరాల భవిత కోసం ప్లాస్టిక్​పై పోరు బాట
author img

By

Published : Jan 17, 2020, 7:32 AM IST

రేపటి తరాల భవిత కోసం ప్లాస్టిక్​పై పోరు బాట

ఆరా, కేరమ్​... ఝార్ఖండ్​ రాంచీ జిల్లాలోని మారుమూల గ్రామాలు. నీటి సంరక్షణలో ఈ రెండు గ్రామాలు చేసిన కృషిని సాక్షాత్​ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తాజాగా ప్లాస్టిక్ భూతంపై ఈ రెండు గ్రామాలు పోరుబాట పట్టాయి.

ఝార్ఖండ్​ రాజధాని రాంచీ నుంచి 25 కి.మీ దూరంలో ఉన్నాయి ఈ రెండు గ్రామాలు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్​ సంచులను పారద్రోలేందుకు ఆరా, కేరమ్ గ్రామ పంచాయతీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.

ప్లాస్టిక్​ రహిత గ్రామంగా మారేందుకు పంచాయతీ సభ్యులు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. నో- ప్లాస్టిక్ నియమాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.

"ఈ ఆలోచనకు మాకు ప్రేరణ ఎక్కడినుంచో రాలేదు. మా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు, అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతి గురువారం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తాం. ఒకసారి అలాంటి సమావేశంలోనే మా గ్రామాన్ని 'ప్లాస్టిక్​ రహితం'గా మార్చాలని తీర్మానించాం. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.150 జరిమానా విధిస్తాం. మరోసారి దొరికితే రూ.500 వేస్తాం." ​
- గోపాల్​ బేడియా, గ్రామపెద్ద

పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు గ్రామాల ప్రజల నుంచి అదే రీతిలో మద్దతు లభిస్తోంది. పాలిథిన్​ కవర్లను వదిలి.. వస్త్ర సంచులవైపు మొగ్గు చూపుతున్నారు గ్రామవాసులు. సంతకు వెళ్లే ప్రతిసారి ఈ సంచులనే తీసుకెళ్తున్నారు.

"మేము సంతకు వెళ్లేటప్పుడు ఈ వస్త్ర సంచులనే పట్టుకెళ్తున్నాం. ఒకవేళ దుకాణదారులు పాలిథిన్​ కవర్లు ఇచ్చినా... మాకు వద్దు.. మా గ్రామంలో ప్లాస్టిక్​ను నిషేధించామని చెబుతున్నాం. మేము పట్టుకెళ్లిన సంచిలోనే సామాన్లు తీసుకొస్తున్నాం."
- రాజమణి దేవి, గ్రామస్థురాలు

ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్​ను గ్రామాల్లో నిషేధించాలని ప్రధాని మోదీ గత ఏడాది ప్రకటించక ముందే ప్లాస్టిక్​ను నిషేధించాలని ఆరా,కేరమ్​ గ్రామాలు తీర్మానించాయి. త్వరలోనే అనుకున్నది సాధిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

Osaka (Japan), Jan 16 (ANI): Many marathon races are held on weekends in Japan.
The usual purpose of most runners is to have healthy body and lose calories. But the purpose of runners in this race is unique and contradictory. The pleasure for runners is going to the water supply station along the race course. Various sweets are lined up on tables. Runners eat sweets as they get tired. The purpose of the marathon race is not to compete in time trial, but to eat favorite sweets. This unique race is named "Sweets Marathon". About 300 kinds of sweets are prepared at the stores and restaurants located in this area. In addition, there are sweets brought from another area too. It is also fun to try these new kinds of sweets. These unrelated purposes for "regional revitalization, sweets and marathons", are strange enough to make many people happy and smile.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.