ETV Bharat / bharat

వలస విషాదం: 100కి.మీ నడిచి ప్రసవం- బిడ్డ మృతి - lockdown

లాక్​డౌన్​ వల్ల పని లేక లుథియానాలోని రామ్​- బిందియా దంపతులు.. బిహార్​లోని సొంత ఊరికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. బిందియా గర్భిణి అయినప్పటికీ.. 100 కిలోమీటర్లు నడిచి అంబాలా చేరుకున్నారు. అక్కడే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. చివరికి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ పసికందు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది.

After walking 100 km, migrant labourer's wife delivers baby; child dies
వలస గాథ: 100కిమీ నడిచిన గర్భిణి.. చివరికి!
author img

By

Published : May 24, 2020, 11:12 AM IST

లాక్​డౌన్​లో వలస కూలీల దయనీయ స్థితిని తెలిపే మరో ఘటన హరియాణాలో జరిగింది. పంజాబ్​లోని లుథియానా నుంచి 100 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించి.. హరియాణాలోని అంబాలాకు చేరుకుంది ఓ గర్భిణి. అక్కడే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆ శిశువు కొద్ది సేపటికే మరణించింది. అంబాలాలోనే ఆ బిడ్డకు అంత్యక్రియలు చేశారు తల్లిదండ్రులు.

ఉద్యోగం పోయి...

బిందియా- రామ్​ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. బిహార్​ నుంచి గతేడాది లుథియానాకు వచ్చారు. అప్పటి నుంచి రామ్​ ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా సంక్షోభం​ వల్ల రామ్​ ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి బిందియాకు సరైన భోజన వసతులు లేవు. గర్భిణికి అందాల్సిన పోషకాలూ అందలేదు.

లాక్​డౌన్​ కారణంగా వేలాది మంది వలస కూలీలు తమ సొంత ఇళ్లకు బయలుదేరారు. ప్రత్యేక రైళ్ల సదుపాయం అందకపోవడం వల్ల.. అంబాలా వరకు కాలినడకన ప్రయాణం చేయాలని రామ్​, బిందియా నిశ్చయించుకున్నారు.

అంబాలా చేరుకున్న అనంతరం బిందియాకు పురిటినొప్పులు మొదలయ్యాయి. పోలీసుల సహాయంతో స్థానిక ఆసుపత్రికి బిందాయను తరలించగలిగాడు రామ్​. ఆమె అడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ పసికందు కొద్దిసేపటికే మరణించింది.

ప్రస్తుతం వీరికి ఓ స్వచ్ఛంద సంస్థ.. వసతి, ఆహార ఏర్పాట్లు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.