దిల్లీలో భాజపా, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఆమ్ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు 2013లో 3 ఓటరు గుర్తింపు కార్డులుండేవని, ప్రస్తుతం ఆయన భార్యకు 3 ఓటరు ఐడీలున్నాయని ఆరోపించింది భాజపా.
అంతకుముందు తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు 2 ఓటరు ఐడీలు ఉన్నాయని.. ఆప్ అభ్యర్థిని అటిషి స్థానిక తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల్లో ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించబోయే వ్యక్తికి ఓటేయడం వృథా అని గంభీర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు కేజ్రీవాల్.
-
पूर्वी दिल्ली के सभी वोटर से मेरी अपील है कि गौतम गंभीर को वोट देकर अपना वोट व्यर्थ ना करें। https://t.co/gPDfn44O6c
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">पूर्वी दिल्ली के सभी वोटर से मेरी अपील है कि गौतम गंभीर को वोट देकर अपना वोट व्यर्थ ना करें। https://t.co/gPDfn44O6c
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 26, 2019पूर्वी दिल्ली के सभी वोटर से मेरी अपील है कि गौतम गंभीर को वोट देकर अपना वोट व्यर्थ ना करें। https://t.co/gPDfn44O6c
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 26, 2019
ఆప్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన భాజపా.. అర్వింద్ కేజ్రీవాల్‌కు 2013లో 3 ఓటరు గుర్తింపు ఎక్కడివని ప్రశ్నించింది.
''కేజ్రీవాల్‌కు 2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు సాహిబాబాద్, సీమాపురి, హనుమాన్ రోడ్లలో ఓటరు ఐడీలున్నాయని అప్పట్లో నేను ఈసీకి ఫిర్యాదు చేశా. దీనిపై కేజ్రీవాల్ ముందు జవాబివ్వాలి.''
- హరీశ్ ఖురానా, భాజపా ప్రతినిధి
ప్రస్తుతం కేజ్రీవాల్ భార్య సునీతకు దిల్లీ, యూపీ, బంగాల్లో ఓటర్ గుర్తింపు కార్డులున్నాయని.. వాటిని ట్విట్టర్లో షేర్ చేశారు ఖురానా.
-
Can u pls explain @ArvindKejriwal ji why ur wife Sunita Kejriwal is having 3 voter ids with her ? 1 from Delhi , 1 from UP and 1 from Bengal .
— Chowkidar Harish Khurana (@HarishKhuranna) April 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Before pointing finger on other first u should come clean .@BJP4Delhi @ManojTiwariMP @GautamGambhir @siddharthanbjp pic.twitter.com/i3g33sMOut
">Can u pls explain @ArvindKejriwal ji why ur wife Sunita Kejriwal is having 3 voter ids with her ? 1 from Delhi , 1 from UP and 1 from Bengal .
— Chowkidar Harish Khurana (@HarishKhuranna) April 26, 2019
Before pointing finger on other first u should come clean .@BJP4Delhi @ManojTiwariMP @GautamGambhir @siddharthanbjp pic.twitter.com/i3g33sMOutCan u pls explain @ArvindKejriwal ji why ur wife Sunita Kejriwal is having 3 voter ids with her ? 1 from Delhi , 1 from UP and 1 from Bengal .
— Chowkidar Harish Khurana (@HarishKhuranna) April 26, 2019
Before pointing finger on other first u should come clean .@BJP4Delhi @ManojTiwariMP @GautamGambhir @siddharthanbjp pic.twitter.com/i3g33sMOut
దీనిపై స్పందించిన ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ 'ముఖ్యమంత్రి భార్య ప్రైవేటు వ్యక్తి. ఆమెకు ఎన్నికలతో సంబంధం లేదు. అయినప్పటికీ.. గంభీర్‌ను, కేజ్రీవాల్‌ను 2019 ఎన్నికల్లో అనర్హుల్ని చేద్దాం' అని భాజపాకు సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: గౌతం గంభీర్‌పై కోర్టులో ఆమ్ఆద్మీ ఫిర్యాదు