ETV Bharat / bharat

ఎమర్జెన్సీపై భాజపా- కాంగ్రెస్​ డిష్యుం డిష్యుం

దేశంలో ఎమర్జెన్సీ విధించి 45 ఏళ్లు అవుతున్న సందర్భంగా కాంగ్రెస్, భాజపా పరస్పర విమర్శలు చేసుకున్నాయి. 45 ఏళ్లు దాటినా కాంగ్రెస్ తీరు మారలేదని భాజపా విమర్శించగా.. కేంద్ర ప్రభుత్వం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించిందని కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.

emergency
'మీదే అత్యయిక స్థితి పాపం'- 'మీ ద్వారానే అప్రకటిత ఎమర్జెన్సీ'
author img

By

Published : Jun 25, 2020, 7:18 PM IST

Updated : Jun 25, 2020, 8:00 PM IST

దేశంలో ఎమర్జెన్సీ విధించి 45 ఏళ్లు అవుతున్న సందర్భంగా కాంగ్రెస్, భాజపా మధ్య మాటలయుద్ధం నడిచింది. ఎమర్జెన్సీ పాపం కాంగ్రెస్​దేనంటూ విమర్శనాస్త్రాలు సంధించింది భాజపా. కాంగ్రెస్ ఇప్పటికీ ఎమర్జెన్సీ నాటి ఆలోచనాధోరణినే కలిగి ఉందని.. ఒకే కుటుంబం ప్రయోజనాలకు అక్కడ గౌరవం ఉందని ఆరోపించింది. కేంద్రంలో వ్యక్తిస్వామ్యం నడుస్తోందని దీనికి కాంగ్రెస్ జవాబిచ్చింది.

ప్రధాని విమర్శలు..

ఎమర్జెన్సీ విధింపుపై తరచూ పదునైన విమర్శలు చేస్తారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అయితే అత్యయిక స్థితి విధించి 45 ఏళ్లయిన సందర్భంగా కాంగ్రెస్​పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీపై పోరాడిన నాటి నేతలకు వందనాలు చెబుతున్నట్లు ట్విట్టర్​ పోస్ట్​లో పేర్కొన్నారు.

  • आज से ठीक 45 वर्ष पहले देश पर आपातकाल थोपा गया था। उस समय भारत के लोकतंत्र की रक्षा के लिए जिन लोगों ने संघर्ष किया, यातनाएं झेलीं, उन सबको मेरा शत-शत नमन! उनका त्याग और बलिदान देश कभी नहीं भूल पाएगा। pic.twitter.com/jlQVJQVrsX

    — Narendra Modi (@narendramodi) June 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్​లో ఇప్పటికీ ఎమర్జెన్సీ..

కాంగ్రెస్ నేతలు చాలామంది పార్టీలో ఇమడలేకపోతున్నారని పేర్కొన్నారు అమిత్​షా. ఇప్పటికీ ఎమర్జెన్సీ నాటి ఆలోచనా ధోరణినే కాంగ్రెస్ అగ్రనేతలు కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు.

emergency
అమిత్​షా ట్వీట్

"45 ఏళ్ల కిందట ఇదే రోజు ఒక కుటుంబం అధికార దాహం వల్ల దేశంలో ఎమర్జెన్సీని అమలు చేశారు. రాత్రికి రాత్రే దేశం జైలుగా మారింది. మీడియా, కోర్టులు, భావ ప్రకటనా స్వేచ్ఛను నలిపేశారు. పేదలు, అణగారిన వర్గాలపై దాడులు జరిగాయి."

- అమిత్​షా ట్వీట్

లక్షలమంది ప్రజల పోరాటంతో దేశంలో ఎమర్జెన్సీని ఎత్తేశారని.. అయితే ఇప్పటికీ కాంగ్రెస్​లో ఎమర్జెన్సీ కొనసాగుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు షా.

ఇప్పటికీ ఒక్క కుటుంబం కోసమే..

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక కుటుంబ ప్రయోజనాలను కాపాడేందుకే కృషి చేస్తుందన్నారు సమాచార, ప్రసార శాఖమంత్రి ప్రకాశ్ జావడేకర్. 45 ఏళ్ల కిందట ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారు.. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. నాడు వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ నాశనం చేసిందని.. విపక్షాల స్వేచ్ఛను హరించిందని పేర్కొన్నారు. అయితే అదే పార్టీ ప్రస్తుతం స్వేచ్ఛ కావాలని నినాదాలు చేస్తోందన్నారు.

emergency
ప్రకాశ్ జావడేకర్ ట్వీట్

'ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోనిద్దాం..'

నాటి అత్యవసర పరిస్థితి నుంచి కొత్త తరాలను సరైన పాఠాలను నేర్చుకోనిద్దామని పేర్కొన్నారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. నాటి ఎమర్జెన్సీ విధింపు పూర్తిగా అప్రజాస్వామికమని చెప్పారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన దినమని వెల్లడించారు.

emergency
రవిశంకర్ ప్రసాద్ ట్వీట్

కాంగ్రెస్ ప్రతి విమర్శలు..

భాజపా నేతలు చేస్తున్న విమర్శలపై దీటుగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరు మాత్రమే నడిపిస్తున్నారని పేర్కొంది. అధికార భాజపా కొనుగోలు రాజకీయాలు ఎందుకు చేస్తుందో సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా.

emergency
రణ్​దీప్ సుర్జేవాలా ట్వీట్

అప్రకటిత ఎమర్జెన్సీ..

ప్రధాని మోదీ దేశంపై అప్రకటిత ఎమర్జెన్సీ విధించారన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. గత ఆరేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థలను బలహీనపరిచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

అత్యయిక స్థితి గుర్తుచేసేది అదే..

ప్రజాస్వామ్యానికి సవాళ్లు ఎదురైతే స్థిరంగా నిలబడాలని ఎమర్జెన్సీ గుర్తుచేస్తుందన్నారు మిళింద్ దిఓరా. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందన్నారు.

emergency
మిళింద్ దిఓరా ట్వీట్

ఇదీ చూడండి: వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు: మోదీ

Last Updated : Jun 25, 2020, 8:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.