ETV Bharat / bharat

పౌర చట్టంపై అసోంలో మళ్లీ నిరసనలు - రోనో హంకార్

సీఏఏ వ్యతిరేక ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించి ఏడాది పూర్తైన సందర్భంగా.. అసోం వ్యాప్తంగా పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. డిసెంబర్​ 11ను 'బ్లాక్​ డే'గా పేర్కొన్నాయి.

After a year, NE states intensifies anti CAA movement
సీఏఏకు ఏడాది- అసోంలో నిరసనలు పునఃప్రారంభం
author img

By

Published : Dec 11, 2020, 9:15 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు శుక్రవారం మళ్లీ రాజుకున్నాయి. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొంది ఏడాది పూర్తైన సందర్భంగా.. అసోంలోని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీఏఏను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ దాదాపు 18 సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. డిసెంబర్​ 11ను చీకటి రోజుగా పేర్కొన్నాయి.

కేఎమ్​ఎస్​ఎస్​, ఆల్​ అసోం స్టూడెంట్స్​ యూనియన్(ఆసు)​, అసోం జాతీయతాబడి యువ చత్ర పరిషత్​, లచిత్​ సేనతో పాటు వివిధ యువజన సంఘాలు అసోం వ్యాప్తంగా నిర్వహించిన నిరసన ర్యాలీల్లో పాల్గొన్నాయి. గతేడాది జరిగిన నిరసనల్లో కస్టడీలోకి తీసుకున్న కృషక్​ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎమ్​ఎస్​ఎస్​)​ నేత అఖిల్​ గొగోయ్​ను విడుదల చేయాలని డిమాండ్​ చేశాయి.

After a year, NE states intensifies anti CAA movement
ర్యాలీ నిర్వహిస్తున్న నిరసనకారులు

వారికి తగిన సమాధానం ఇవ్వాలి

గతేడాది సీఏఏ వ్యతిరేక ఆందోళనలను ప్రారంభించిన శివసాగర్​ ప్రాంతం నుంచే.. మళ్లీ తాజాగా ప్రారంభించారు. కొవిడ్​ ప్రభావంతో.. ఈ నిరసనలను ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపివేశారు.

మాట్లాడుతున్న విద్యార్థి సంఘం నాయకుడు

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి తగిన సమాధానం చెప్పాలని ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రపౌరుల గుర్తింపు, భాష, సాంస్కృతిక గౌరవాన్ని సీఏఏ కాలరాస్తుందంటూ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మధ్య అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సీఏఏను వ్యతిరేకిస్తూ.. పలు చోట్ల నల్లజెండాలు

సీఏఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు

'రోనో హంకార్'​ పేరుతో సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని శనివారం 'ఆసు' పిలుపునిచ్చింది. తన ప్రధాన కార్యాలయం బయట నల్లజెండాను ఎగురవేసింది. ఏడు రాష్ట్రాల్లోని.. నార్త్​ ఈస్ట్​ అసోసియేషన్​(ఎన్​ఈఎస్​ఓ) కార్యాలయాల్లోనూ ఈ తరహా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సీఏఏను ఉపసంహరించుకోవాలని ఆసు ముఖ్య సలహాదారు సముజ్జల్​ భట్టాచార్య డిమాండ్ చేశారు.

"ఐదుగురు అసోం పౌరులు, విద్యార్థుల మృతికి కారణమైన పౌర చట్టాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆసు పోరాడుతుంది."

-- ఆల్​ అసోం స్టూడెంట్స్​ యూనియన్.

నిరసనల్లో మృతిచెందిన వారికి నివాళులు అర్పిస్తున్న విద్యార్థులు

అసోం రాజధాని గువాహటిలో గతేడాది జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. 2014, డిసెంబర్​ 31కు ముందు పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​లోకి వచ్చిన ముస్లిమేతరులకు సీఏఏ ద్వారా పౌరసత్వం లభిస్తుంది.

ఇదీ చూడండి:వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.