ETV Bharat / bharat

జ్వరంతోనూ జెండా ఎగరేసిన ఎల్​కే అడ్వాణీ - BJP

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ తన నివాసంలో జెండా ఎగరేశారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నా... త్రివర్ణ పతాకాన్ని ఇంట్లో ఆవిష్కరించే ఆనవాయితీని ఈ ఏడాదీ కొనసాగించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలకు మాత్రం ఈసారి హాజరు కాలేకపోయారు అడ్వాణీ.

జ్వరంతోనూ జెండా ఎగరేసిన ఎల్​కే అడ్వాణీ
author img

By

Published : Aug 15, 2019, 5:26 PM IST

Updated : Sep 27, 2019, 2:52 AM IST

భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ దిల్లీలోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇంట్లో జెండా ఎగరేసే ఆనవాయితీని అనేక దశాబ్దాలుగా అనుసరిస్తున్నారు అడ్వాణీ.

విష జ్వరంతో బాధపడుతున్నకారణంగా ఈసారి స్వాతంత్ర్య వేడుకల్లో అడ్వాణీ పాల్గొనడం లేదని ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గురువారం ఆరోగ్యం కాస్త కుదుటపడినందు వల్ల ఎప్పటిలాగే తన నివాసంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు అడ్వాణీ. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుల సన్నిహితులు వెల్లడించారు.

తొలిసారి ఎర్రకోట వేడుకలకు గైర్హాజరు

ఎర్రకోటలో ఏటా నిర్వహించే స్వాతంత్ర్య వేడుకల్లో దశాబ్దాల కాలంగా పాల్గొంటూ వస్తున్నారు అడ్వాణీ. ఆరోగ్య కారణాలతో ఈ ఏడాది మాత్రం హాజరు కాలేకపోయారు.

ఇదీ చూడండి: ఎర్రకోటపై మోదీకి రెండో అతిపెద్ద ప్రసంగం

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 2:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.