కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇంకా ప్రాణాధార వ్యవస్థపైనే చికిత్స పొందుతున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడానికి ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు.
భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ సోమవారం ఎయిమ్స్‌ను సందర్శించారు. జైట్లీ ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఆర్థికమంత్రి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.
కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా జైట్లీ కోసం ఎయిమ్స్ వెళ్లారు.
శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న అరుణ్‌జైట్లీని కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఎయిమ్స్‌లో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి 10వ తేదీ నుంచి ఎయిమ్స్... ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇదీ చూడండి:- యమున ఉగ్రరూపం.. దిల్లీకి ప్రమాద హెచ్చరిక