చైనా దాష్టీకంతో ఉద్రిక్తతలు తలెత్తిన లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది భారత్. ఇప్పటికే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరించగా..మరో 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను సరిహద్దుల్లోకి పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు తెలిపాయి. చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గస్తీని పెంచేందుకే అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ప్రాంతాల్లో ఐటీబీపీలోని 20 అదనపు కంపెనీలకు చెందిన బలగాలు (2000 మంది)ని మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల మేర ఉన్న ఎల్ఏసీ వెంబడి ఇప్పటికే.. గస్తీ కాస్తున్నాయి ఐటీబీపీ దళాలు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కారకోరమ్ పాస్ నుంచి జచెప్ లా వరకు 180 సరిహద్దు పోస్టుల వద్ద ఐటీబీపీ బలగాలను మోహరించారు.
ఇదీ చూడండి: 'గల్వాన్ లోయ భారత్‌దే.. చరిత్రే సాక్ష్యం'