ETV Bharat / bharat

స్మార్ట్​ఫోన్​కు బానిసయ్యారా? బయట పడండిలా - Smart phone

స్మార్ట్​ఫోన్​కు మీరు బానిసయ్యారనిపిస్తోందా? సామాజిక మాధ్యమాల నుంచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేకపోతున్నారా? అయితే 'ఏడు రోజుల సూత్రం' పాటించి.. స్మార్ట్​ఫోన్​ బానిసత్వం నుంచి బయటపడటం ఎలాగో చదివేయండి మరి.

Addicted to smart phone? Then know how to get rid off that
స్మార్ట్​ఫోన్​కు బానిసయ్యారా? బయట పడాలంటే ఇలా చేయండి
author img

By

Published : Mar 8, 2020, 8:13 AM IST

స్మార్ట్​ఫోన్​.. ప్రస్తుత సమాజంలో దాదాపు ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని ఎలక్ట్రానిక్​ పరికరం. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్​కు బానిసలవుతున్నారు. అంతేకాదు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ తనపై తాను నియంత్రణ కోల్పోయి.. యంత్రాలు తనను శాసించే స్థాయికి పడిపోతున్నాడు మానవుడు. అయితే డిజిటల్​ విప్లవం వల్ల కలిగే ప్రయోజనాలు పక్కన పెడితే, ఈ ఎలక్ట్రానిక్​ యంత్రాలు మనిషి జీవితాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకే వీటి నివారణ చర్యలు ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమయ్యాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సామాజిక మాధ్యమాలను వదిలేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మోదీ ట్విట్టర్​, ఫేస్​బుక్​, యూట్యూబ్​ సహా పీఎంవో ట్విట్టర్​ అకౌంట్ల నిర్వహణ బాధ్యతను నారీ శక్తి అవార్డు గ్రహీతలకు అప్పగించనున్నారు. అయితే మోదీ ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక వ్యూహం ఉంటుంది. ప్రస్తుత సమాజం సామాజిక మాధ్యమాల్లో లీనమైపోతున్న నేపథ్యంలో.. ప్రధాని తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక దాగున్న అంతరార్థం ఏమిటో తెలియాలంటే వేచి చూడాలి.

రోజువారీ జీవితంలో భాగమైపోయిన ఈ ఎలక్ట్రానిక్​ పరికరాల బానిసత్వం నుంచి మనిషి బయటపడేందుకు ఒక మార్గం ఉంది అదే "డిజిటల్ డిటాక్స్​". ఇదేంటి అనుకుంటున్నారా? డిజిటల్​ పరికరాలకు దూరంగా ఉండటమే "డిజిటల్​ డిటాక్స్".​ అయితే అది ఎలా చేయాలో తెలుసుకుందాం.

వారం రోజుల కార్యాచరణ...

ఎలక్ట్రానిక్​ పరికరాలకు దూరంగా ఉండటమంటే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటమే. అయితే ఉన్నట్లుండి సామాజిక మాధ్యమాలకు దూరమవడం అంత సులువు కాదు. అందుకే మీకు సెలవులు ఉన్నప్పుడు ఈ ఏడు రోజుల కార్యచరణ అమలు చేయండి.

1. మొదటి రోజు- ఉదయాన్నే మీ చరవాణిలోని 10 యాప్​లను తొలగించండి.

2. రెండో రోజు- మీ ఫోన్ డిస్​ప్లేని నలుపు తెలుపు రంగుల్లో మాత్రమే పెట్టుకోండి. గ్రేస్కేల్​ ఆప్షన్​ వాడండి. ఇలా చేస్తే ఫోన్​ని పదే పదే చూడాలన్న ఆకాంక్ష కాస్త తగ్గుతుంది.

3.మూడో రోజు- నోటిఫికేషన్లు ఆఫ్​ చేయండి. వాట్సప్​, ఫేస్​బుక్​, ఈమెయిల్స్​, ఇతర నోటిఫికేషన్ల శబ్దాలు మీ చెవిని చేరకూడదు.

4.నాలుగో రోజు- ఇది చాలా కష్టమైన రోజు. కానీ తప్పదు. మీ ఫోన్లోని 5జీబీ డేటాను డిలీట్​ చేయండి. ఇక్కడ డేటా అంటే వీడియోలు, ఫోటోలు, మెసేజులు.

5.ఐదో రోజు- మీ ఫోన్​ను గంటకు ఒకసారి మాత్రమే చూడాలి. అలా అని తెరిచినప్పుడు గంటల తరబడి చూడకండి. దానికి సమయం సెట్​ చేసుకోండి. 5 నిమిషాలా? పది నిమిషాలా అన్నది మీ అవసరాన్ని బట్టి.

6. ఆరో రోజు- చరవాణిలో అలారం సెట్ చేయండి. పడుకునేముందు ఫోన్​ను చాలా దూరంగా పెట్టుకోండి. చేతికి అందకూడదన్నమాట. పడుకుని మళ్లీ ఉదయం లేచిన తర్వాతే మీ చేతిలో ఫోన్​ కనిపించాలి.

7. ఏడో రోజు- యాప్​ వంక చూస్తే తెరవాలి అనిపిస్తుంది. కాబట్టి హోంపేజీ పై ఎలాంటి యాప్స్​ పెట్టుకోకండి. అన్నీ కలిపి రెండో పేజీలో ఒకే ఫోల్డర్​లో పెట్టుకోండి.

లేదంటే ఇలా ప్రయత్నించండి..!

ఇలా ఏడు రోజుల కార్యచరణ అమలు చేయడం అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. అలాంటివారు చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

ఫోన్​ పదే పదే ఎందుకు చూస్తారు? అనే ప్రశ్న వేస్తే... సమయం కోసం అన్న జవాబే చాలా మంది ఇచ్చారు. అంటే సమయం కోసం వాచ్​ పెట్టుకుంటే ఫోన్​ వంక చూసే పని తప్పుతుంది. నోటిఫికేషన్ల శబ్దాలు పూర్తిగా నిషేధించండి. అవి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మీకు వచ్చిన మెసేజ్​లు చదివేందుకు, నోటిఫికేషన్లు చూసుకునేందుకు కచ్చితంగా ఇంత సమయం మాత్రమేనని కేటాయించుకోండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.