ETV Bharat / bharat

సోనూసూద్​ హామీ ఇచ్చాడు.. నెరవేర్చాడు - సోనూసూద్ సాయం

కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి నటుడు సోనూసూద్ అండగా నిలుస్తున్నారు. ఆయనకు సమాచారమిస్తే చాలు సాయమందినట్టే. తాజాగా కర్ణాటకలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళకు.. ఇచ్చిన హామీని నెరవేర్చారు. రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.

Sonu Sood
సోనూసూద్
author img

By

Published : Aug 27, 2020, 4:15 PM IST

కర్ణాటకలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన పద్మకు ఇచ్చిన హామీని నటుడు సోనూసూద్​ నెరవేర్చారు. తొలుత నిత్యావసరాలు అందిస్తానన్న సోనూ.. కొరియర్ ద్వారా రెండు నెలలకు కావాల్సిన సామగ్రిని పంపారు.

బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులను సోనూసూద్ ప్రతినిధి గోవింద్ అగర్వాల్ పంపించారు. పిల్లల చికిత్సకూ సాయమందిస్తామని తెలిపారు.

పాత్రికేయుడి సమాచారంతో..

కర్ణాటకలోని యాదగిరి జిల్లా రామసముద్ర గ్రామానికి చెందిన నాగరాజు అనే దినసరి కూలీ భార్య పద్మ.. వారం క్రితం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబ పరిస్థితి గురించి స్థానిక పాత్రికేయుడు ఒకరు సోనూసూద్‌కు సమాచారం అందించారు. సాయం చేయాలని అభ్యర్థిచారు.

ఈ నేపథ్యంలో సోనూ.. పేదలకు సాయం కోసం నియమించిన తన బృందం బాధ్యుడు గోవింద్‌ అగర్వాల్‌ను వారికి సాయపడాలని సూచించారు. నాగరాజుతో మాట్లాడిన గోవింద్‌ అగర్వాల్‌... రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, పిల్లలకు చికిత్స కోసం ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: సోనూ దాతృత్వం.. 20 వేల మంది కూలీలకు వసతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.