తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు, నటి నుస్రత్ జహాన్ ఈరోజు ప్రారంభమైన శీతాకాల సమావేశాలకు గైర్హాజరయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న నుస్రత్... కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతోనే లోక్సభ సమావేశాలకు హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బంగాల్లోని బషీర్హత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు నుస్రత్.