ETV Bharat / bharat

కరోనా కాలంలో కేంద్రం సాధించిన విజయాలివే: రాహుల్​

కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏయే నెలలో కేంద్రం ఏమి చేసిందో ఎద్దేవా చేస్తూ ట్వీట్​ చేశారు.

Rahul gandhi
కరోనా కాలంలో కేంద్రం సాధించిన విజయాలివే: రాహుల్​
author img

By

Published : Jul 21, 2020, 9:49 AM IST

Updated : Jul 21, 2020, 10:07 AM IST

భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కొద్ది రోజులుగా విమర్శల దూకుడు పెంచారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. రోజుకో తీరులో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలివేనంటూ ఫిబ్రవరి నుంచి జులై వరకు పలు అంశాలతో ట్వీట్​ చేశారు.

ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్​' సభ నిర్వహించగా.. మార్చిలో మధ్యప్రదేశ్​లో ప్రభుత్వాన్ని కూలగొట్టారని ఆరోపించారు. జులైలో రాజస్థాన్​లోనూ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విశ్వప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.

'కరోనా కాలంలో ప్రభుత్వం సాధించిన ఘనతలు'

Rahul gandhi
రాహుల్​ గాంధీ ట్వీట్​
  • ఫిబ్రవరి: నమస్తే ట్రంప్​
  • మార్చి: మధ్యప్రదేశ్​లో ప్రభుత్వాన్ని కూలదోయటం
  • ఏప్రిల్​: దీపాలు వెలిగించడం
  • మే: సర్కారు 6వ వార్షికోత్సవం
  • జూన్​: బిహార్​లో వర్చువల్​ ర్యాలీ నిర్వహణ
  • జులై: రాజస్థాన్​లో ప్రభుత్వాన్ని కూలదోయటానికి విశ్వప్రయత్నం

ఈ విధంగా కరోనాపై పోరులో దేశం స్వయంసమృద్ధి సాధించిందని కేంద్రానికి చురకలంటించారు రాహుల్​.

ఇదీ చూడండి: ''మోదీ-బలమైన వ్యక్తి' కల్పితమే.. దేశ అతిపెద్ద బలహీనత'

Last Updated : Jul 21, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.