ETV Bharat / bharat

'ఆర్టికల్ 370 రద్దు' పిటిషన్లపై నేడు సుప్రీం తీర్పు

అధికరణ​ 370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్​ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. వ్యాజ్యాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం ప్రకటించనుంది. చివరగా జనవరి 23న ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది.

Abrogation of Art 370: SC to pass order on whether to refer issue to larger bench
ఆర్టికల్ 370 రాజ్యాంగ బద్ధత పిటిషన్లపై నేడు సుప్రీం తీర్పు
author img

By

Published : Mar 2, 2020, 5:31 AM IST

Updated : Mar 3, 2020, 2:59 AM IST

'ఆర్టికల్ 370 రద్దు' పిటిషన్లపై నేడు సుప్రీం తీర్పు

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే అధికరణం- 370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్​ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు తీర్పును ప్రకటించనుంది. జనవరి 23న జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును రిజర్వులో ఉంచింది. పిటిషన్‌దారులు కోరినట్లు ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి విచారణ బాధ్యతను అప్పగించే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

కేంద్రం వాదనలు..

అధికరణం-370 రద్దు అనేది ముగిసిన అధ్యయమని.. ఆ సత్యాన్ని అంగీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయమేదీ లేదని గతంలో విచారణ సందర్భంగా కేంద్రం వాదించింది.

అధికరణం-370కి సంబంధించి ప్రేమ్‌నాథ్‌ వర్సెస్‌ జమ్ము కశ్మీర్‌(1959), సంపత్‌ ప్రకాశ్‌ వర్సెస్‌ జమ్ము కశ్మీర్‌(1970) కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ పిటిషన్‌ దారులు వాదించడాన్ని వేణుగోపాల్‌ తప్పుపట్టారు. రెండు వేర్వేరు అంశాలకు సంబంధించిన తీర్పులుగా వాటిని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలో వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చూపించగలిగితేనే విస్తృత ధర్మాసనానికి పంపించే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది కోర్టు.

ఇదీ చూడండి: 'మోటేరా సభ చూసిన తర్వాత ఏదీ పెద్దదిగా లేదు'

Last Updated : Mar 3, 2020, 2:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.