జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం చారిత్రక నిర్ణయమని భారత సైన్యాధిపతి ముకుంద్ నరవాణే తెలిపారు. ఈ నిర్ణయంతో పొరుగు దేశం ప్రేరేపిస్తున్న పరోక్ష యుద్ధానికి భారత్ అడ్డుకట్ట వేసిందని పేర్కొన్నారు. 72వ ఆర్మీ డే సందర్భంగా... దిల్లీలో నిర్వహించిన సైనిక కవాతులో పాల్గొన్న నరవాణే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తే భారత సైన్యం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు సైన్యాధిపతి. వారికి తగిన రీతిలో సమాధానం చెప్పే సామర్థ్యం సైన్యానికి ఉందన్నారు.
"గత ఏడాది కాలంలో దేశ రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టాం. మన సైన్యం పొరుగు దేశాలతో పోరాడటమే కాకుండా.. నియంత్రణ రేఖ, వాస్తవిక రేఖ వంటి సరిహద్దులను సురక్షితంగా కాపాడుకోగలిగింది. భద్రతా పరమైన సిద్ధాంతాలను పాటిస్తూ సరిహద్దులో చర్చలు ద్వారా శాంతిని నెలకొల్పాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది."
-నరవాణే, సైన్యాధిపతి.
ఆర్మీడే సందర్భంగ్ విధుల నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమర జవానులకు నివాళులర్పించారు నరవాణే.
ఇదీ చూడండి : తమిళనాడు: జల్లికట్టు పోటీల్లో 700 బసవన్నలు సై