ETV Bharat / bharat

రెండోసారి భారత ప్రధానిగా నేడే మోదీ 'ప్రమాణం' .. - DELHI

ఎన్డీఏ లోక్​సభాపక్ష నేత నరేంద్ర మోదీ నేడు భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాత్రి 7 గంటలకు దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ ఎదుట జరిగే కార్యక్రమంలో మోదీతో పాటు.. కొత్త మంత్రులూ ప్రమాణం చేయనున్నారు.

రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం నేడే..
author img

By

Published : May 30, 2019, 5:02 AM IST

Updated : May 30, 2019, 7:05 AM IST

నేడే మోదీ ప్రమాణ స్వీకారం

ఇటీవల ముగిసిన లోక్​సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రెండోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ ఎదుట బహిరంగ స్థలంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరగనుంది. ప్రపంచ దేశాధినేతలు, అన్ని రాష్ట్రాల ప్రముఖులు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన భాజపా కార్యకర్తల కుటుంబాల సమక్షంలో ఘనంగా జరగనుందీ వేడుక. రాత్రి 7 గంటలకు జరగనున్న కార్యక్రమంలో నరేంద్ర మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ మోదీతో ప్రమాణం చేయించనున్నారు.

మంత్రివర్గంలో ఎవరెవరు...?

మంత్రి వర్గంలో ఎవరెవరు ఉంటారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. కూర్పుపై పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్​షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు మోదీ. కేంద్ర ప్రభుత్వంలో కీలకం కాగలరని భావిస్తున్న షాకు ఏ మంత్రిత్వ శాఖ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 353 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. భాజపానే స్వయంగా 303 సీట్లు నెగ్గి పూర్తి మెజార్టీ సాధించింది. కాంగ్రెస్​ 52 స్థానాలకే పరిమితమైంది.

8 వేల మందికి పైగా అతిథులు...

ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన భాజపా.. వేల మందికి ఆహ్వానాలు పంపింది. కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. రాష్ట్రపతి భవన్​లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద కార్యక్రమం అని పేర్కొన్నారు రాష్ట్రపతి భవన్​ ప్రతినిధి అశోక్​ మాలిక్​.

బిమ్​స్టెక్​ దేశాధినేతల హాజరు...

మోదీ ప్రమాణ స్వీకారానికి ఈ సారి బిమ్​స్టెక్​ దేశాలతో పాటు మారిషస్​, కిరిగిస్థాన్ అధినేతలకు ఆహ్వానాలు పంపారు. బిమ్​స్టెక్​ దేశాల్లో భారత్​, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్​ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 2014లో మోదీ పదవిని స్వీకరించేటప్పుడు సార్క్​ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అందులో పాకిస్థాన్​ అప్పటి ప్రధాని నవాజ్​ షరీఫ్​ కూడా ఉన్నారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, తెలుగు రాష్ట్రాల నుంచి కేసీఆర్​, జగన్​, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

వంటల ఘుమఘుమలు...

ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆతిథ్యం ఇవ్వనున్న విందు కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు. 'దాల్​ రైసినా'ను విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా వడ్డించనున్నారు.

భాజపా ఎంపీలంతా మొదట దిల్లీలోని మహాత్మాగాంధీ, వాజ్​పేయీ సమాధుల వద్ద నివాళులర్పించనున్నారు. ప్రధానితో పాటు ఎంపీలంతా ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని భాజపా ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రివర్గం కూర్పుపైనా సుదీర్ఘ చర్చలు జరిగాయి. నూతన మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది ప్రమాణ స్వీకారం సమయంలో స్పష్టం కానుంది.

ఇదీ చూడండి:

'సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే వరకు వేచి ఉంటాం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 29th May 2019.
1.00:00 SOUNDBITE (English): Rafael Nadal, second seed:
(beat Yannick Maden of Germany 6-1, 6-2, 6-4)
(Q. Are you satisfied with the level of your game, or do you think there is something to improve?)
"There is always things to improve. No, that's part of the day of work. But for the moment have been enough to be in the third round. Two good matches, three sets. Now I have a very tough opponent in front, a player who plays very well against top players, too. He's a top player. He had some injuries. But is a very tough third round to play against David (Goffin). So is the moment to making a step forward. Good thing is I have good feelings, and I hope to be ready to play at the level that I need."
2. 00:38 SOUNDBITE (French): Rafael Nadal, second seed:
(beat Yannick Maden of Germany 6-1, 6-2, 6-4)
(Q. I thought you were going to be a bit upset because of the third or your double faults in the third set?)
"Well, okay, I made a few mistakes. What do you want me to say? I won 6-1, 6-2, 6-4. Well, I can't tell you it cannot happen. It happened today. It doesn't happen that much. Well, the reality is that when I was able to break again, I was able to win."
3. 01:11 SOUNDBITE (French): David Goffin:
(beat Miomir Kecmanovic of Serbia 6-2, 6-4, 6-3)
(Q. A three-set victory. You did quite well. I guess it gives you a lot of confidence?)
"It was a great game, a great beginning of the match. I started off with the right intention. I was able to dictate the match immediately. I was up from the outset of the match, and then he got into the game, but I was able to handle the match even when he was performing well, including in the third set. When he started playing well, I was able to step up my game, and I ended up with a second break. I think it was a well-handled match, very robust and with a lot of consistency."
4. 02:21 SOUNDBITE (French): David Goffin:
(beat Miomir Kecmanovic of Serbia 6-2, 6-4, 6-3)
(Q. Would you say this is the perfect preparation before your face-off with Nadal in the third round?)
"In terms of result, yes. But I haven't played against a lefty these two first rounds. I haven't played against someone who plays like him (Nadal). No one plays like him (Nadal). But in terms of confidence, yes, it will boost my confidence. I did not tire myself too much and I advanced to the third round. Therefore, yes, it's good preparation for my game."
5. 02:58 SOUNDBITE (English): Guido Pella, 19th seed:
(lost to Corentin Moutet 6-3, 6-1, 2-6, 7-5)
(Q. Was there anything he did that maybe surprised you or is it just his level was that much better, he's improving and, like you said, playing in Paris definitely helped him?)
"I think I didn't have so much power in my strokes today. So I think that was the key for him to maybe play his best tennis. But I tried to do my best in those three hours, I think. And most of the time I didn't feel comfortable with my game, and I think he played good because, like I said, he had nothing to lose. And, yeah, he's young. He's playing in Roland Garros. He's French. So, yeah, he played good."
6. 03:06 SOUNDBITE (Spanish): Guido Pella, 19th seed:
(lost to Corentin Moutet 6-3, 6-1, 2-6, 7-5)
"I couldn't play the tennis I wanted and obviously in a Grand Slam it is difficult to win. Obviously I leave with a lot of regrets because I knew it was a good opportunity, but he played very well, he did very well what he's good at. I didn't take advantage when I had my chances and of course it is tough to fight when you find yourself two sets down. Plus, I didn't feel as good physically as I felt in my previous matches and that made it even more difficult."
SOURCE: FFT/SNTV
DURATION: 03:33
STORYLINE:
Reaction from second round winners Rafael Nadal, David Goffin and the 19th seed Guido Pella, who lost at the French Open in Paris on Wednesday.
Last Updated : May 30, 2019, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.