కొవిడ్-19 రోగులను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ మరో ఘనతను సాధించింది. ఎక్కువ మంది డౌన్లోడ్ చేసిన హెల్త్‌కేర్ యాప్‌గా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. ఏప్రిల్‌లో ప్రపంచంలోనే డౌన్లోడ్ చేసిన టాప్-10 యాప్‌లలో ఇది కూడా ఒకటని వెల్లడించారు.
-
Incredible ! India leads the world in leveraging technology to fight COVID-19. #AarogyaSetu:the most downloaded healthcare app & amongst the top 10 downloaded apps in the World for April 2020 in 1st month itself.Never seen this before. We are united in our fight against COVID-19. pic.twitter.com/Ah4GOzdatM
— Amitabh Kant (@amitabhk87) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Incredible ! India leads the world in leveraging technology to fight COVID-19. #AarogyaSetu:the most downloaded healthcare app & amongst the top 10 downloaded apps in the World for April 2020 in 1st month itself.Never seen this before. We are united in our fight against COVID-19. pic.twitter.com/Ah4GOzdatM
— Amitabh Kant (@amitabhk87) May 8, 2020Incredible ! India leads the world in leveraging technology to fight COVID-19. #AarogyaSetu:the most downloaded healthcare app & amongst the top 10 downloaded apps in the World for April 2020 in 1st month itself.Never seen this before. We are united in our fight against COVID-19. pic.twitter.com/Ah4GOzdatM
— Amitabh Kant (@amitabhk87) May 8, 2020
"కరోనా కట్టడికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంలో ప్రపంచ దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఆరోగ్య సేతు యాప్ ఎక్కువ మంది డౌన్లోడ్ చేసిన హెల్త్‌కేర్ యాప్. 2020 ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసిన టాప్ 10 యాప్‌లలో ఒకటిగా నిలిచింది."
-అమితాబ్ కాంత్, నీతి అయోగ్ సీఈఓ
మే 4 వరకు దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కరోనా నివారణ కోసం ఈ యాప్‌ను ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం.
చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్న కరోనా బాధితులను గుర్తించటం కోసం ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఏప్రిల్ 14న ప్రజలకు సూచించారు ప్రధాని. నీతి ఆయోగ్, ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి.