దిల్లీలో వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శాసనసభ సభ్యురాలు అతిశీ సింగ్‌కు కొవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయింది. మంగళవారం ఆమె నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. నేడు ఫలితాలను వెల్లడించారు.
ప్రస్తుతం అతిశీ.. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వైరస్ బారినపడిన ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షించారు.
'కరోనాపై పోరాటంలో అతిశీ కీలకపాత్ర పోషించారు. ఆమె త్వరగా కోలుకొని.. తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని ఆశిస్తున్నా.'
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
ఇటీవల దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ కూడా కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా.. ఆయనకు కరోనా నెగటివ్‌గా తేలింది. మరోసారి ఆయన నమూనాలు సేకరించారు వైద్యులు.
ఇదీ చదవండి: గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం