కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల పొత్తు చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా రెండు పార్టీలు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. దిల్లీతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ పొత్తుపై చర్చించాలని ఆప్ ప్రతిపాదించగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తిరస్కరించామని కాంగ్రెస్ నేత పీసీ చాకో తెలిపారు.
" దేశమంతా కాంగ్రెస్ విధానమొక్కటే. మహాకూటమిని ఏర్పరచి భాజపాను ఓడించాలి. ఇందుకోసం ఆమ్ ఆద్మీతో చర్చించాము. అయితే దిల్లీలో చేసినట్టే ఇతర ప్రాంతాల్లోనూ పొత్తు ఉండాలని ఆప్ అంటోంది. ఇతర రాష్ట్రాల్లో ఆప్తో పొత్తు పెట్టుకునేందుకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ స్థితిలో కలిసి పోటీ చేయటం కుదరలేదు. ఒంటరిగానే పోటీ చేస్తున్నాం."
- పీసీ చాకో, కాంగ్రెస్ నేత
ఆప్తో జేజేపీ పొత్తు
హరియాణాలో జననాయక జనతా పార్టీతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుంది. రాష్ట్రంలోని 10 లోక్సభ స్థానాల్లో ఆప్ 3, జేజేపీ 7 సీట్లలో బరిలో నిలవనున్నాయి.
హరియాణాలో కాంగ్రెస్, జేజేపీలతో పొత్తుకు ఆప్ ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్ తిరస్కరణతో మిగిలిన రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
ఇవీ చూడండి: జయప్రదతో ఆజంఖాన్ ముఖాముఖి..!