ETV Bharat / bharat

కేజ్రీవాల్​పై దాడికి కారణం అదేనట! - sureshkumar

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​పై ఓ వ్యక్తి దాడి చేయడానికి ఆమ్​ ఆద్మీ పార్టీనేతలపై అసంతృప్తే కారణమని పోలీసులు వెల్లడించారు. కేజ్రీవాల్​ వరకు నిందితుడు ఎలా చేరుకున్నాడో, ఘటనకు గల కారణాలేమిటో పోలీసులు విచారిస్తున్నారు.

కేజ్రీపై దాడికి ఆప్​ నేతలపై అసంతృప్తే కారణమట!
author img

By

Published : May 5, 2019, 9:41 AM IST

Updated : May 5, 2019, 11:51 AM IST

కేజ్రీపై దాడికి ఆప్​ నేతలపై అసంతృప్తే కారణమట!

దిల్లీ సీఎం, ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్​పై దాడికి నేతల అసంతృప్తే కారణమని పోలీసులు వెల్లడించారు. ఘటనపై డీసీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించనున్నామని అధికారులు వెల్లడించారు. సైన్యంపై ఆప్​ నేతలకు నమ్మకం లేదనే వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు నిందితుడు వెల్లడించాడని సమాచారం.

​ ఆప్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

"ఆప్ టోపీ, కండువాను ధరించి సీఎం భద్రతా వలయం లోపలే ఆయన ఉన్నాడు. పార్టీకి చెందిన నేతగా భావించి ఎవరూ ఆయనకు అభ్యంతరం తెలపలేదు. వాహనానికి కుడివైపున నిల్చున్న అతడు ఒక్కసారిగా జీపు ఎక్కి సీఎంపై దాడికి తెగబడ్డాడు."-పోలీసుల ప్రకటన

కొత్తదిల్లీ అభ్యర్థి బ్రిజేశ్​ గోయల్ తరఫున కేజ్రీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా దూసుకొచ్చిన వ్యక్తి ప్రచార రథంపైకి ఎక్కి కేజ్రీ పై చేయి చేసుకున్నాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఆప్ కార్యకర్తలు చితకబాదారు. నిందితుడు కైలాశ్​ పార్కుకు చెందిన సురేశ్​గా గుర్తించారు.

కేజ్రీవాల్​పై భౌతికదాడి జరగడం ఇది రెండోసారి.

ఇదీ చూడండి: లాటరీ కింగ్​పై ఐటీ దాడి.. రూ.595 కోట్లు స్వాధీనం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Scheduled news bulletins only. "Courtesy NBC Sports" must be displayed throughout the clip. No Internet. Use within 48 hours following the conclusion of the program. During any single news program, each Excerpt shall not exceed fifteen (15) seconds in duration and two (2) minutes in the aggregate. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
+++ SCRIPTING INFORMATION AND SHOTLIST TO FOLLOW +++                        
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
SOURCE: NBC Sports
DURATION:
STORYLINE:
Last Updated : May 5, 2019, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.