బ్యాంకు ఖాతాను తెరిచేందుకు, సిమ్ కార్డులు తీసుకునేందుకు ఆధార్‌ను గుర్తింపుకార్డుగా ఉపయోగించటానికి వీలుకల్పించే ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీనికి సంబంధించిన బిల్లు లోక్‌సభలో జనవరి 4న ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభను దాటలేదు. ప్రస్తుత లోక్‌సభతో పాటే ఈ బిల్లు కూడా రద్దు కానుంది.
కిసాన్ రెండో విడతకు...
కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రెండో విడత డబ్బులు పొందటానికి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించింది.