ETV Bharat / bharat

'కొద్దిరోజుల్లో పెళ్లి... ఇంతలోనే చైనా దుర్నీతికి బలి' - china india border issue

గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చైనాపై సత్వరమే ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నాయి. మరోవైపు.. అమర వీరుల్లో ఒకరైన బంగాల్​ జవాను... పెళ్లికి కొద్ది రోజుల ముందే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.

soldier dead
'మోదీజీ.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే'
author img

By

Published : Jun 17, 2020, 12:42 PM IST

భారత్- చైనా సరిహద్దు వెంట తూర్పు లద్దాక్​లో జరిగిన ఘర్షణలో బంగాల్​ భీర్బమ్​కు చెందిన రాజేశ్​ ఓరంగ్ అనే జవాను అమరుడయ్యాడు. కుటుంబంలో ఒకే ఒక్క మగ సంతానం అయిన ఓరంగ్ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. అంతలోనే సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చైనాపై భారత్ బదులు తీర్చుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

"నా కుమారుడు దేశానికి సేవ చేశాడు. అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది."

-సుభాష్ ఓరంగ్, రాజేశ్ తండ్రి

weeping of rajesh family
రాజేశ్ మృతిపై కన్నీరు మున్నీరవుతున్న తల్లి, సోదరి

భీర్బమ్​ జిల్లా బెల్గారియాకు చెందిన 25 ఏళ్ల రాజేశ్ ఓరంగ్ 2015లో బిహార్​ రెజిమెంట్​లో జవాన్​గా చేరాడు. గత జనవరిలో గ్రామానికి వెళ్లాడు. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అభిప్రాయపడింది రాజేశ్ చెల్లి.

జవాన్.. నీకు సలాం

సరిహద్దు ఘర్షణలో అసువులు బాశాడు హిమాచల్ ప్రదేశ్ హరీంపుర్ జిల్లా కరోటాకు చెందిన జవాన్ అంకుశ్ ఠాకూర్. అతని మరణవార్త విని గ్రామమంతా చైనాకు వ్యతిరేకంగా నినదించింది. కుటుంబానికి బాసటగా నిలిచింది.

21 ఏళ్ల అంకుశ్ 2018లో పంజాబ్ రెజిమెంట్​లో విధుల్లో చేరాడు. అతని తండ్రి, తాతలు కూడా సైన్యంలో సేవలందించారు. అంకుశ్​కు ఆరో తరగతి చదివే సోదరుడు ఉన్నాడు.

ఇదీ చూడండి: భారత్​ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతాలివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.