ETV Bharat / bharat

ఆర్టికల్​ 370 రద్దుకు ఏడాది- లోయలో మార్పులెన్ని? - ఆర్టికల్​ 370

అధికరణ 370ని రద్దు చేసి ఏడాది గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఏఏ మార్పులు జరిగాయన్న అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. నిర్ణయం చారిత్రకమైనదే అయినా ఆ ఫలితంగా అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదీ గుర్తించాలి. అసలు లక్ష్యం కూడా అదే. ఈ విషయమై.. కేంద్రానిది ఓ వాదన.. స్థానికులు, నిపుణులది మరో వాదన. కేంద్రం తమ ప్రతి నిర్ణయం ఆమోదయోగ్యమైనదే అని చెబుతుంటే స్థానికుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. 'ఈటీవీ భారత్' క్షేత్రస్థాయి పర్యటనలో ఇదే తేలింది. స్థిర నివాస ధ్రువీకరణ చట్టం, వ్యూహాత్మక ప్రాంతాలు గుర్తించటం లాంటివి కశ్మీర్‌ లోయలో అలజడి రేపుతున్నాయి.

A year since Art 370 move, a look at what's changed in Jammu and Kashmir
ఆర్టికల్​ 370 రద్దుకు ఏడాది.. లోయలో మార్పులెన్ని?
author img

By

Published : Aug 5, 2020, 6:33 AM IST

"చారిత్రక తప్పిదాన్ని సరిచేస్తున్నాం"... గతేడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కేంద్రం చెప్పిన మాట ఇది. ఈ చారిత్రక నిర్ణయానికి ఏడాది పూర్తయిన తరుణంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తోంది భాజపా. అదే సమయంలో జమ్ము, కశ్మీర్ పరిస్థితులు చూస్తే .. అక్కడి ప్రజలను ఇంకా భయాందోళనలు వీడటం లేదన్నది నిపుణుల మాట. 'ఈటీవీ భారత్'‌ స్వయంగా స్థానికులు, నిపుణులతో మాట్లాడినప్పుడు అదే విషయం స్పష్టమైంది.

అభివృద్ధిపై ఆశలు..

గత నవంబర్​లో జమ్ము, కశ్మీర్​లో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటుకు పెట్టుబడులు ఆకర్షించేందుకు భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించింది స్థానిక ప్రభుత్వం. దీంతో అక్కడ మునుపెన్నడూ లేని అభివృద్ధి జరగనుందనే అంచనాలు పెరిగాయి.

జమ్ముకశ్మీర్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు-2020 దృష్టిలో ఉంచుకుని ఈ భూ సేకరణ ప్రక్రియ చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. 624 ఎకరాల భూమిని ఇందుకోసం సేకరించినట్టు తెలిపింది. మరింత సేకరిస్తున్నట్టు పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ రవీందర్ కుమార్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. ఈ సదస్సుతో జమ్ము, కశ్మీర్‌లో వ్యాపార రంగంలో అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

మార్చిలోనే ఈ సదస్సు జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. వ్యాపార సంస్కరణలు, పారిశ్రామిక ఎస్టేట్ల నిర్మాణం, భూ సేకరణకు ఈ సమయాన్ని వినియోగించుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

కొత్త చట్టాలతో చిక్కులు...

ఈ ఏడాది మార్చి 31న కేంద్ర ప్రభుత్వం స్థిరనివాసానికి సంబంధించి ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తీసుకొచ్చిన ఈ చట్టంతో భారత ప్రజలంతా జమ్ము, కశ్మీర్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 29 చట్టాలను రద్దు చేసిన కేంద్రం 109 చట్టాల్లో సవరణలు చేపట్టింది. అయితే విపక్షాలు మాత్రం కేంద్రం ఈ నిర్ణయాలపై విమర్శలు చేస్తునే ఉన్నాయి. అవన్నీ వివక్షాపూరితమైన చర్యలుగా అభివర్ణిస్తున్నాయి.

కొత్తచట్టం ప్రకారం.. నాన్‌ గెజిటెడ్ క్లాస్‌-4 ఉద్యోగాలను జమ్ముకశ్మీర్ ప్రజలకే ఇస్తారు. అదికూడా స్థానికంగా 15 సంవత్సరాల పాటు నివసిస్తున్నట్టు, 7 సంవత్సరాల పాటు అక్కడే చదువుకున్నట్టు ఆధారాలున్నవారికే. 10 సంవత్సరాల పాటు జమ్ము, కశ్మీర్‌లోనే సేవలు అందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్ ఉద్యోగాలకు అర్హులు. ప్రస్తుతానికి వేరే రాష్ట్రంలో పని చేస్తున్నా.. ఈ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించకుండా మిగతా వారినీ ఇక్కడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటాన్ని అనుమతించటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కమిషనర్‌ కింద నమోదైన వలసదారులకు మాత్రం ఈ అర్హతలేమీ లేకుండానే స్థిరనివాస ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే ఈ నిర్ణయంపై స్థానిక రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌, పీపుల్ డెమొక్రటిక్ పార్టీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే జమ్ము, కశ్మీర్‌లోని వ్యవసాయ విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్‌ చౌదరి.. జమ్ము నుంచి స్థిరనివాస ధ్రువీకరణ పత్రం పొందిన మొదటి ఉన్నతాధికారిగా నిలిచారు.

వ్యూహాత్మక ప్రాంతాలపై..

కేంద్రం మరో నిర్ణయంపైనా అక్కడి పార్టీలు అసహనంగానే ఉన్నాయి. ఈ ఏడాది జులై 17న జమ్ము, కశ్మీర్‌ ప్రభుత్వం స్థానికంగా సాయుధ బలగాలకు సంబంధించి నిర్మాణాల కోసం వ్యూహాత్మక ప్రాంతాలు గుర్తించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం హోం మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలన్న నిబంధననూ రద్దు చేసింది. ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము కూడా ఆమోదం తెలిపినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

1970లోని జమ్ము, కశ్మీర్ అభివృద్ధి చట్టం, 1988లోని కంట్రోల్ ఆఫ్ బిల్డింగ్ ఆపరేషన్స్‌ చట్టాలు సవరించాలన్న ప్రతిపాదనకూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిజానికి ఈ 2 చట్టాలు వ్యూహాత్మక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు మినహాయింపు కల్పిస్తాయి. అందుకే వీటిని సవరించాలని భావిస్తోంది. గృహ, పట్టణాభివృద్ధి విభాగం ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం ద్వారా వ్యూహత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాల కోసం నిర్మాణాలు చేపట్టేందుకు ఆస్కారముంటుంది. ఫలితంగా భద్రతనూ పెంచుకున్నట్టు అవుతుంది. కానీ ఈ నిర్ణయాన్నీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జమ్ము, కశ్మీర్‌ను ప్రజల ఆమోదం లేకుండానే పూర్తి స్థాయిలో సైనిక ప్రాంతంగా మార్చాలని చూస్తున్నారని విమర్శిస్తున్నాయి.

వ్యవసాయ భూములు వ్యూహాత్మక ప్రాంతాలుగా మార్చటమేంటని నేషనల్ కాన్ఫరెన్స్‌ ప్రశ్నిస్తోంది. పీడీపీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతోంది. జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయటంకన్నా ఇది మరింత ఆందోళనకర నిర్ణయమని అంటోంది. ఐతే ప్రస్తుతం ఉన్న చట్టాలు మీరకుండానే సవరణలు చేసి అమలు చేస్తున్నట్టు జమ్ము, కశ్మీర్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధులు చెబుతున్నారు. పర్యావరణపరంగా, ప్రమాణాలపరంగా అన్నీ పరిశీలించాకే నిర్మాణాలు చేపడతామని.. వీటి వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలగదని హామీ ఇస్తున్నారు. కంటోన్మెంట్ జోన్లు వెలుపల ఎలాంటి వ్యూహాత్మక ప్రాంతాలు నిర్ధరించమని.. అంతర్గత భద్రతకు అనువైన స్థలాలనే అందుకు వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

స్థానికుల్లో ఆందోళన...

మొత్తంగా చూస్తే మాత్రం ఈ వరుస నిర్ణయాలన్నీ స్థానిక ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నట్టు ఈటీవీ భారత్ గుర్తించింది. వారెవరూ ముందుకొచ్చి మాట్లాడేందుకు ఆసక్తి కనబరచకపోయినా వాళ్ల మాటలు బట్టి ఇదే స్పష్టమవుతోంది. నిపుణులు మాత్రం ఆర్టికల్‌ 370 అధికరణ రద్దును ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాలు చేయటం, సవరించటమే సహజమే. వీటిని అమలు చేసినప్పుడు ప్రజలు అనుసరించటమో...లేక వాటి పరిణామాలు ఎదుర్కోవటమో జరుగుతుంది. కానీ ఏడాదిగా ప్రభుత్వ నిర్ణయాలపై కశ్మీర్‌ ప్రజలు తరచు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారన్నది అక్కడి నిపుణుల మాట. ప్రస్తుతానికి జమ్ము, కశ్మీర్‌లో ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోవటం.. ఇద్దరు, ముగ్గురు ఉన్నతాధికారులు పరిపాలనాపరమైన విషయాలు చూసుకోవటం ప్రజాస్వామ్యాన్ని అయోమయంలో పడేసిందని అంటున్నారు విశ్లేషకులు.

నిర్ణయాలు సరైనవేనా?

వ్యూహాత్మక ప్రాంతాలు గుర్తించటం, స్థిరనివాస ధ్రువీకరణ పత్రం కల్పించటం లాంటి నిర్ణయాలు సరైనవే అయితే.. ప్రజల్లో ఆందోళన ఎందుకుంటుంది అన్నది నిపుణుల ప్రశ్న. ప్రత్యేకంగా ఓ రాజకీయ వ్యవస్థ ఉండి ఉంటే..ఈ సమస్య ఎదురయ్యేది కాదని వారంతా వాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కచ్చితంగా స్థిరనివాస ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సిందిగా ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తున్న వారూ ఉన్నారు. ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు ఇది అవసరమే అయినా...జమ్ము, లద్ధాఖ్‌లో ఈ చట్టంపై నిరసనలు వ్యక్తమవుతున్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.