మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. పెళ్లయిన 15రోజులకే రోడ్డుప్రమాదంలో భర్తను కోల్పోయిన ఓ ఇల్లాలు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృత్యువుతో పోరాడుతోంది. ఇండోర్‌కు చెందిన 28ఏళ్ల యువతికి.. ఉజ్జయినికి చెందిన యువకుడితో 15రోజులక్రితం వివాహం జరిగింది. ఇండోర్‌లో వారు కాపురం పెట్టారు. అయితే రెండ్రోజులక్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో భర్త మృతి చెందటం వల్ల తీవ్ర మనోవేదనకు గురైన ఆ ఇల్లాలు షాపింగ్‌మాల్ మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
తీవ్రంగా గాయపడిన ఆమెను షాపింగ్ మాల్ భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భర్తతో కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలన్న సూసైడ్ నోట్ ఆమె వద్ద లభ్యమైంది. షాపింగ్ మాల్ మూడోఅంతస్తు నుంచి ఆ ఇల్లాలు దూకిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి:- ప్రాణాలకు తెగించి.. గర్భిణికి చేయూత