ఒడిశాలో ఓ ఎలుగుబంటి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కలహంది జిల్లాలోని భవానీపట్న నగరంలో జనావాసాల్లోకి వచ్చిన భల్లూకం.. అటుగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఇంతలో స్థానికులు అప్రమత్తమై.. దానిపై ఎదురుదాడికి దిగారు. దీంతో బాధితుడ్ని వదిలేసి అక్కడి నుంచి పరారైందా ఎలుగుబంటి.
అనంతరం.. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆ భల్లూకాన్ని పట్టుకునే ఏర్పాట్లు చేశారు. త్వరలోనే దాన్ని అడవిలోకి పంపిస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి నితీశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: పవర్ బ్యాంక్ ఆర్డర్ చేస్తే.. అమెజాన్ రెడ్ మీ ఫోన్ ఇచ్చింది!