'అష్టాచమ్మా' నటి స్వాతి గుర్తుంది కదా. పన్నుపై పన్నుతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇలా ఉండటం ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని దదుసాహి ప్రాంతంలో అపశకునంగా భావిస్తారు. చిన్న పిల్లలకు పన్నుపై పన్ను వస్తే చెడు జరుగుతుందని అక్కడి గిరిజనుల నమ్మకం.
శునకంతో పెళ్లి..
చిన్న పిల్లలకు శునకాలతో పెళ్లి చేయడం ద్వారా పరిహారం జరుగుతుందని విశ్వసిస్తారు అక్కడి ప్రజలు. సంక్రాంతి పండుగ అయిపోగానే మాఘ వేడుకలో ఈ వివాహం జరిపిస్తారు.
సాధారణ పెళ్లిళ్ల లాగానే వీటినీ నిర్వహిస్తారు. వధువు, వరుడికి పసుపు, కుంకుమ పెట్టడం లాంటివి చేస్తారు. వారి ఆచారం ప్రకారం క్రతువును ముగిస్తారు. ఇరుగుపొరుగు సందడి, ఆటపాటలతో ఈ వేడుకను నిర్వహించడం విశేషం.
ఇదీ చూడండి: అక్కడి ఆ ఐదురోజులు మహిళలు దుస్తులేసుకోరట!