దిల్లీ లోధి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ 122వ బెటాలియన్లో కాల్పులు కలకలం రేపాయి. ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సబ్ ఇన్స్పెక్టర్.
లోధి ఎస్టేట్లోని హోంమంత్రి భవనం వద్ద శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ కర్నేల్ సింగ్, ఇన్స్పెక్టర్ దశరథ్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగిందని.. మాటామాటా పెరిగి తీవ్ర రూపం దాల్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కర్నేల్ సింగ్ ఇన్స్పెక్టర్పై కాల్పులు జరిపినట్లు చెప్పారు. తూటా గాయాలతో దశరథ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా.. కొద్ది సమయానికే సబ్ ఇన్స్పెక్టర్ కర్నేల్ సింగ్ కూడా తుపాకీతో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఘటనపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.