ETV Bharat / bharat

చెన్నై: కిలో పిండి కొంటే బకెట్ నీరు ఉచితం - ట్రిప్లికేన్

చెన్నైలో నెలకొన్న కరవు పరిస్థితుల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై ట్రిప్లికేన్ ప్రాంత వాసులకు ఓ శుభవార్త వినిపించారు సీకేఆర్ గుప్తా అనే ఓ పిండి దుకాణ యజమాని. కిలో పిండి కొంటే బకెట్ నీటిని ఉచితంగా అందిస్తున్నారు.

చెన్నై: కిలో పిండి కొంటే బకెట్ నీరు ఉచితం
author img

By

Published : Jul 1, 2019, 9:55 PM IST

చెన్నై: కిలో పిండి కొంటే బకెట్ నీరు ఉచితం

చెన్నైలోని ట్రిప్లికేన్ వాసులకు తీపి కబురు వినిపించారు ఓ దుకాణం యజమాని. గతంలో ఎన్నడూ లేనంత నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న చెన్నైలో ఆయన చేసిన ప్రకటన తెలిసిన వారికి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లకు అవసరమైన పిండితో పాటు బకెట్ నీటిని ఉచితంగా అందిస్తున్నారు.

సీకేఆర్ గుప్తా చెన్నైలోని ట్రిప్లికేన్​లో 50 ఏళ్లుగా నివసిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నెలకొన్న నీటి ఎద్దడి పరిస్థితుల్లో లారీ ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. తమకూ నీటిని అందించాలని తన వద్ద పని చేసే వాళ్లు, చుట్టు పక్కల ప్రజల నుంచి వచ్చిన వినతులతో ఒక కిలో పిండి కొనుగోలు చేస్తే బకెట్ నీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించి, అమలు చేయడం ప్రారంభించారు. అంతే కాదండోయ్... నీటిని కాచి వడబోసిన అనంతరమే వాడండి అనే బ్యానర్​నూ దుకాణం ముందు ప్రదర్శిస్తున్నారు.

"గత 30 ఏళ్లుగా నేను దుకాణాన్ని నడుపుతున్నాను. ముందుగా మేం పిండిగిర్ని నడిపేవాళ్లం. తర్వాత కాలంలో పిండి తయారు చేసి అమ్మడం ప్రారంభించాం. గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇంత కరవు చూడలేదు. నీటి ఎద్దడి కారణంగా పనివాళ్లు సమయానికి రావడం లేదని దుకాణంలో పనిచేసేవారు చెప్పారు. నేను లారీ ద్వారా నీటిని తెప్పించుకుంటున్న కారణంగా.. వారికి అవసరమైన నీటిని ఇవ్వాలని కోరారు. వారికి నీళ్లు ఇచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండేవాళ్లూ నీటి కోసం అడగడం ప్రారంభించారు. ఈ డిమాండ్​పై నేను ప్రజలకు నీటినందిస్తున్నాను."

-సీకేఆర్ గుప్తా, దుకాణ యజమాని

ఈ దుకాణంలో పిండి ధర రూ. 35 దానితో పాటు బకెట్ నీళ్లు ఉచితం. ఎప్పుడు నీళ్లు అవసరమైనా పిండి కొనుగోలు చేసి పొందే సౌలభ్యం ఉండటం కారణంగా దుకాణంలోని పిండికీ గిరాకీ పెరిగింది.

ఇదీ చూడండి: కశ్మీర్​ రిజర్వేషన్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

New Delhi, Jul 01 (ANI): Vidya Balan who is currently spending time with husband Siddharth Roy Kapur along with family in New York, attended the Pride Parade with excitement and vigour. The 'Tumhari Sulu' actor shared pictures and videos on Instagram stories where she can be seen waving the LGBTQ rainbow flag along with a video of the Pride Parade where several people thronged the streets of New York to celebrate the occasion with great joy. World Pride day took place during the 50th anniversary of the Stonewall riots, considered the catalyst for the modern gay rights movement. On the work front, the actor will be seen in 'Mission Mangal' where she will be starring along Akshay Kumar, Taapsee Pannu, Sonakshi Sinha, Sharman Joshi, and Nithya Menen.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.