బంగాల్లో ఓ వృద్ధురాలు కేవలం టీ, పాన్లతోనే జీవనం సాగిస్తోంది. ఒక్కపూట తిండి లేకపోతేనే ఆకలితో విలవిల్లాడిపోతుంటారు కొందరు. అయితే నందరాణి మహంత అనే 67 ఏళ్ల వృద్ధురాలు మాత్రం ఇందుకు భిన్నం. ఆహారమే లేకుండా 30 ఏళ్లుగా టీతోనే జీవిస్తోంది.
రోజుకు 10-12 కప్పుల టీ
దక్షిణ దినాజ్‌పుర్‌కు చెందిన మహంతకు ఓ కుమారుడు (రంజిత్ మహంత) ఉండేవాడు. అయితే.. కుటుంబ సమస్యల కారణంగా 30 ఏళ్ల క్రితమే అతడు బంగ్లాదేశ్‌కు తరలిపోయాడు. అప్పటి నుంచి బలూర్‌ఘాట్‌లో నివసిస్తూ.. ఇలా పాలతో కూడిన టీకు అలవాటుపడింది మహంత. ఆహారమనేదే లేకుండా.. రోజుకు 10-12 కప్పులు టీ తాగుతుంది. దీనికి తోడు పాన్ కూడా వేసుకుంటుంది. జీవనాధారం కోసం మరమరాలు, నిత్యవసర వస్తువుల వ్యాపారం చేస్తుంది. అప్పుడప్పుడూ మరమరాలను తింటుంటానని చెబుతుంది.

అయినా ఫిట్..
ఇలా మూడు దశాబ్దాలుగా ఆహారం తీసుకోకపోయినా మహంత ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. మిల్క్టీలో ఉండే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ లాంటి పోషకాల వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ఇక టీలోని చక్కెర ఆమె శరీరానికి అవసరమైన క్యాలరీలను అందిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రోగనిరోధక శక్తిని పెంచే కరోనా టీ