ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లాలోని చంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.
చంద్రనగర్‌లోని 'పన్నా' రోడ్డు వైపు వెళ్తున్న స్కార్పియో.. ఎదురుగా వస్తున్న మూడు మోటారు సైకిళ్లను ఢీకొనడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.