పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. ఇలానే కేరళ కోజికోడేకు చెందిన ఓ ప్రైవేటు బస్సు సంస్థ కొత్తగా ఆలోచించింది. ప్రయాణికుల ఆరోగ్యమే సంస్థకు శ్రీరామ రక్ష అనుకున్నట్లుంది. బస్సులో కోవిడ్‌కు సంబంధించి ప్రత్యేకత జాగ్రత్తలు తీసుకుంది.
ప్రవేశ ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లను ఏర్పాటు చేసింది. అంతేగాక చేతులు పరిశుభ్రం చేసుకునేందుకు కుళాయి ద్వారా నీటి సౌకర్యం కల్పించింది. ఇలా వినూత్నంగా ఆలోచించి ప్రయాణికుల ప్రశంసలు అందుకుంటుంది.