సాధారణంగా ఒక ప్రాంతం పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంటుంది. కానీ బంగాల్ బీర్భూమ్ జిల్లాలోని శాంతినికేతన్ మాత్రం అందుకు భిన్నం. అక్కడ ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఠాణాలను చూడవచ్చు.
శాంతినికేతన్ పోలీస్ స్టేషన్ అనేది మొదట బోల్పూర్ పోలీస్ స్టేషన్ కింద పనిచేసే ఔట్‌పోస్టు. దీన్ని 2015లో ప్రత్యేక ఠాణాగా మార్చారు. అప్పటినుంచి ఇది వేరుగా విధులు నిర్వహిస్తోంది. కానీ ఇప్పటికీ ఇది బోల్పూర్ పరిధిలోనే ఉంది.
అయితే ఇక్కడి పోలీసు స్టేషన్‌కు లేఖ రాయాల్సి వస్తే కేవలం పిన్‌కోడ్ వేస్తే సరిపోదు. కచ్చితంగా ఆ ప్రాంతం పేరు కూడా రాయాలి. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ...రాష్ట్రంలోనే ఇలాంటి పోలీస్ స్టేషన్ మరొకటి ఉండదేమో అని అన్నారు.
ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో వేరు వేరుగా గ్రామాలు ఉన్నాయి. అయితే శాంతినికేతన్ పోలీస్‌స్టేషన్ మాత్రం బోల్పూర్ ఠాణా పరిధిలో ఉండడం గమనార్హం.