దేశ రాజధాని నగరంలో పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం కలకలం రేపింది. దీంతో దిల్లీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అతడు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడు, ఏఏ చిరునామాల్లో పిజ్జాలు డెలివరీ చేశాడన్న జాబితా రూపొందించింది.
పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో మరో 17 మంది డెలివరీ బాయ్‌లు కలిసి తిరిగినట్లు దిల్లీ ప్రభుత్వం గుర్తించింది. వీరంతా మొత్తం 72 కుటుంబాలకు పిజ్జా డెలివరీ చేసినట్టు తేల్చింది. వీరందరినీ క్వారంటైన్ చేసింది.