కేరళ మలప్పురానికి చెందిన సలీం సొంతంగా తయారు చేసుకున్న జీపు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే అది ఒకప్పుడు ఆటో. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 10వ తరగతితోనే చదుపు ఆపేశాడు సలీం. ఆ తర్వాత మెకానిక్‌గా స్థిరపడ్డాడు. పని పూర్తయ్యాక రాత్రి సమయాల్లో తనకొచ్చిన ఆలోచనలతో కొత్త కొత్త ప్రయోగాలు చేసేవాడు. వాటి ఫలితంగానే ఆటోను జీపుగా మార్చాడు.
సలీంకు ఇలాంటి ఆవిష్కరణలు కొత్తేం కాదు. గతంలో బావిలోనుంచి నీటిని తోడే యంత్రాన్ని, రిమోట్ రాకెట్‌నూ రూపొందించాడు. వ్యర్థాలతో క్రికెటర్ బొమ్మను కూడా తయారు చేశారు.
చిన్నప్పుడు చదువుకునే సమయాల్లో సైన్స్ పట్ల సలీంకు ఎక్కువ ఆసక్తి ఉండేది. సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాల్లో విద్యార్థులు అతని సాయం కోరేవారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న సలీం తన తర్వాత ప్రయోగం ఒకరు ప్రయాణించగలిగే విమానాన్ని తయారు చేయడమేనట. అందుకు కావాల్సిన కసరత్తులు కూడా మొదలుపెట్టేశాడట.
ఇదీ చూడండి: దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం