కర్ణాటక మైసూరు నగరంలో నాణేలు కలకలం రేపాయి. సీబయ్య రోడ్డులో రోజూ రాత్రి వేళల్లో ఓ దుండగుడు వీధుల్లో నాణేలు చల్లుతున్నాడు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తి విచిత్ర చర్యతో స్థానికుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.
సైకిల్‌పై వెళుతూ..
ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి రోడ్డుపై నాణేలు విసిరి వెళ్లిపోయాడు. అయితే స్థానికంగా ఛాయ్ హోటల్ యజమాని బాబు.. ఓ రోజు ఆ నాణేలను తీసుకోవడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది.
బాబుకు గృహ నిర్బంధం..
ఈ విషయంపై కాలనీవాసులు ఫిర్యాదు చేయగా.. అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై నాణేలు తీసుకున్న బాబును గృహ నిర్బంధంలో ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. ఆ వీధిని క్రిమీ సంహారక మందులతో పిచికారి చేశారు.
నాణేలు విసిరిన దుండగుడిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.