ETV Bharat / bharat

లాక్​డౌన్​ పొడిగింపు దిశగా కేంద్రం ఆలోచన!

author img

By

Published : Apr 7, 2020, 3:18 PM IST

Updated : Apr 7, 2020, 7:40 PM IST

ఈనెల 14న ముగియనున్న దేశవ్యాప్త లాక్​డౌన్​ను పొడిగించే దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. చాలా రాష్ట్రప్రభుత్వాలతో పాటు నిపుణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

A lot of state governments, as well as experts, are requesting Central Government to extend the lockdown.
లాక్​డౌన్​ పొడిగింపు దిశగా కేంద్రం ఆలోచన!

లాక్‌డౌన్‌ను పొడిగించే దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రానికి సూచిస్తున్నందున ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

మార్చి 25న కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ఈనెల 14తో ముగియనుంది. అయితే దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలని తెలంగాణ, రాజస్థాన్​ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విన్నవించాయి. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నందున కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఐఆర్​సీటీసీ కీలక నిర్ణయం...

లాక్​డౌన్​ పొడిగింపు ఖాయమన్న అంచనాల నడుమ భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్​సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 30 వరకు టికెట్ బుకింగ్​లను నిలిపివేసింది.

దేశంలో 3 ప్రైవేట్ రైళ్లు నడుపుతోంది ఐఆర్​సీటీసీ. లాక్​డౌన్​ కారణంగా తొలుత మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు బుకింగ్​లు నిలిపివేసింది. ఆ తర్వాత రోజులకు టికెట్లు విక్రయించింది. అయితే... తాజాగా ఏప్రిల్​ 30వరకు బుకింగ్​లు నిలిపివేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము వాపసు వస్తుందని తెలిపింది ఐఆర్​సీటీసీ.

Last Updated : Apr 7, 2020, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.