లాక్డౌన్ వేళ ఇంట్లో కూర్చుని ఏం చేయాలో తోచక.. ఓ రైతు బావిని తవ్వేశాడు. యావత్ ప్రపంచం లాక్డౌన్ పట్ల అసహనం వ్యక్తం చేస్తుంటే.. కర్ణాటక మంగళూరుకు చెందిన నోనయ్య పూజారి మాత్రం.. ఎంచక్కా లాక్డౌన్ను తనకు అనుకూలంగా మల్చుకున్నాడు.
బాంత్వాల్ తాలూకా పొర్సపాలుకు చెందిన నోనయ్యకు కొంత పొలం ఉంది. గతేడాది అందులో వేరుసెనగ పంట వేయగా.. అది కాస్తా నీరు లేక ఎండిపోయింది. పొలంలో ఓ బావి తవ్విస్తే.. సాగు చేసుకోవచ్చనుకున్నాడు. కూలీలను మాట్లాడేందుకు వెళ్తే కరోనా భయంతో ఎవ్వరూ రాలేదు.
లాక్డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి.. తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి తానే బావి తవ్వడం ప్రారంభించాడు. ఏప్రిల్ 25 నుంచి మే 16 వరకు 40 అడుగుల మేర గొయ్యి తవ్వేశాడు. లాక్డౌన్ వేళ సమయం వృథా చేయకుండా.. మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన నోనయ్య శ్రమకు మెచ్చి.. నేలమ్మ నీళ్లు వదిలింది.
ఇదీ చదవండి:కరోనా సోకింది.. బిర్యానీపై మనసు లాగింది!