కుటుంబసభ్యుడి లాంటి ఓ 'వృషభన్న' పుట్టిన రోజును వైభవంగా చేసింది కర్ణాటక హుబ్బళ్లిలోని ఓ పరివారం. అదరగుంచి గ్రామంలోని గమనగట్టి అనే రైతు కుటుంబంలో 1994 జులై 12న జన్మించింది ఓ మగ లేగదూడ. దానికి ముద్దుగా 'రామ' అని నామకరణం చేశారు. అప్పటి నుంచి సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నారు. గత 16 ఏళ్లుగా పొలం పనుల్లో గమనగట్టి పరివారానికి సహాయం చేస్తున్నాడు రాముడు. కుటుంబ యజమాని అశోక గమనగట్టితో రాముడికి ప్రత్యేక అనుబంధం ఉంది.
శుక్రవారం జులై 12న రాముడి పుట్టినరోజును ఘనంగా జరిపించారు గమనగట్టి పరివారం. ఎద్దుకు స్నానం చేయించారు. అందంగా అలంకరించారు. బర్త్డే కేక్ కట్ చేశారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-1కు కొనసాగింపే కానీ... ప్రత్యేకం