ETV Bharat / bharat

''రక్షణ'లో స్వావలంబనతో ప్రపంచ శాంతికి ఊతం' - ఆత్మనిర్భర్ భారత్ వార్తలు

దేశ స్వయం సమృద్ధితో పాటు ప్రపంచ శాంతికి దోహదం చేసే లక్ష్యంతో 'ఆత్మనిర్భర్​ భారత్​'పై నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భారత రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.

MODI
నరేంద్రమోదీ
author img

By

Published : Aug 27, 2020, 6:12 PM IST

Updated : Aug 27, 2020, 6:44 PM IST

దేశ సామర్థ్యం పెంపుతోపాటు ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వానికి ఊతమివ్వాలన్నదే ఆత్మ నిర్భర భారత్​ లక్ష్యమని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్రమోదీ. భారత్​ స్వయం సమృద్ధి సాధిస్తే... హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత పటిష్ఠం అవుతుందని, చుట్టుపక్కల దేశాలకు ఆయుధాల సరఫరాదారుగా మారుతుందని వివరించారు.

ఆత్మనిర్భర్​ రక్షణ పరిశ్రమల వెబినార్​లో మాట్లాడిన మోదీ.. కొన్నేళ్లుగా మనకున్న వనరులు వినియోగించుకోవటంలో విఫలమయ్యాయని అన్నారు. భారతీయ రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.

"చాలా సంవత్సరాలుగా అతిపెద్ద రక్షణ దిగుమతిదారులలో భారత్ ఒకటి. స్వాతంత్య్రం తొలినాళ్లలో రక్షణ తయారీలో భారత్​ గొప్ప సామర్ధ్యం కలిగి ఉంది. దేశంలో 100 ఏళ్ల క్రితమే రక్షణ ఉత్పత్తుల తయారీ వ్యవస్థను స్థాపించారు. దురదృష్టవశాత్తు ఈ అంశంపై అవసరమైన దృష్టిని సారించలేకపోయాం.

ప్రస్తుతం దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా దేశీయంగానే రక్షణ పరికరాల ఉత్పత్తి చేస్తాం. ఇందుకోసం ఈ రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని నిర్ణయించాం."

- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: 'సరిహద్దులో 1962 తరవాత ఇదే తీవ్రమైనది'

Last Updated : Aug 27, 2020, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.